భక్తి కథలు

హరివంశం 60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర విహార సముత్సుకమైన మహావృషభాలతో అవి ఆనందీశ్వరులతో అవి ఒప్పారుతున్నాయి. వేద సంపదలాగా అవి పొలు పారుతున్నాయి. విష్ణు సంకీర్తనలలాగా అవి శ్రుతిపేయంగా శోభిస్తున్నాయి. యజ్ఞ కలాపాలలాగా పవిత్ర దర్శనీయంగా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలలాగా నిత్య నిర్మలంగా ఉన్నాయి.
మంత్రాలలాగా అవి రక్షించుకోవలసినవిగా ఉన్నాయి. దైవాల వలె పూజార్హంగా ఉన్నాయి. గురువులను సేవించి సంతోష పెట్టవలసినవిగా ఉన్నాయి. అఖిల లోకోపకార సంపదలలాగా అవి ప్రవర్థమానంగా ఉన్నాయి. రస రంజకమైన భావాలతో అవి పోలిక వహిస్తున్నాయి. గోపాలురకు అవి తరగని నిధులు లాగా ఉన్నాయి. నీతి పథం వలె అర్థ సంపదను వ్రజ వాసులకు అవి చేకూరుస్తున్నాయి. సర్వకాలాలలో అవి వారికి సంతోష జనకంగా ఉన్నాయి.
ఈ విధంగా తమ గో సంపద కలకలలాడుతూ ఉండటంతో ఆనంద భరితులై నందగోపుడూ, ఇంకా ఇతర కుల పెద్దలూ ఈ సంతోష వేళ ఏదైనా గొప్ప ఉత్సవం చేయాలని సంకల్పించుకున్నారు. వానలు పుష్కలంగా కురిసాయి. పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండాయి. పచ్చగడ్డి కనుల పండువుగా సమృద్ధిగా కనపడుతున్నది. అడవులు కళకళలాడుతున్నాయి. పూలూ పండ్లూ కొల్లలుగా లభిస్తున్నాయి.
ఎటువంటి బాధలు లేకుండా ప్రజలు సుఖజీవనం చేస్తున్నారు. చోర బాధలు ఎక్కడా లేవు. రాజులు నీతి పథం తప్పకుండా పాలన చేస్తున్నారు. కాబట్టి మనం అత్యంత వైభవంగా ఇంద్రోత్సవం చేసుకుందాం, ఇప్పటినుంచే ఆ ప్రయత్నంలో వుందాం అని నందగోపుడూ, కుల పెద్దలూ నిర్ణయించుకుని ఊళ్ళో చాటింపు వేయించారు. ఇందుకు కావలసిన వస్తు సామగ్రినంతా ఇంటింటా సిద్ధపరచుకోవటం మొదలుపెట్టారు. అపుడు శ్రీకృష్ణుడు వాళ్ళ తత్తరపాటు చూసి ఏమిటి? విశేషం? ఎవరిని గూర్చి ఈ ఉత్సవం. దీనినెందుకు తలపెట్టారు? అని నవ్వుతూ ఆ పెద్దలను అడిగాడు.
గోకులంలో అందరిలోనూ వృద్ధుడైన గోపకుడు కృష్ణుడి కప్పుడిట్లా చెప్పాడు. ‘నాయనా! నందనందనా! లోకపాలురందరికీ ఇంద్రుడు ప్రభువు. లోకాలన్నింటికీ ఆయన ఆధారం. ఆయన వర్షాలు కురిపిస్తాడు. మేఘాలన్నీ ఆయన ఆజ్ఞకు లోబడి ప్రవర్తించాయి. వర్షాలు కురిస్తేనే కదా పంటలు పండటం! పశు సంపద వృద్ధి కావటం! ప్రాణిజాతమంతా సుఖంగా మనుగడ సాగించటం! గోవులకు ఆయన వల్లనే మేలు కలుగుతుంది. కాబట్టి గోపాలురకందరికీ ఆయన అర్చించవలసిన దైవం. అందువల్లనే మేము ఇప్పుడు ఇంద్రోత్సవాన్ని తలపెట్టాము.
‘అంతేకాక మన మందలన్నీ వృద్ధి కావటానికీ, మనుకు ఆయనే అన్నదాత కాబట్టీ, ఆయనే మన పరదైవం. ఆయన ఇచ్చింది ఆయనకే సమర్పించి పూజించటం మన విధి విధానం కదా! గోపకులం వారు ప్రతి సంవత్సరం ఈ ఇంద్రోత్సవం జరపటం ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టే ఈ సన్నాహమంతా అని ఆ వృద్ధుడు కృష్ణుడికి వివరించాడు.
అపుడు కృష్ణుడు గోపాల సముదాయమంతా వింటుండగా ఇట్లా చెప్పాడు. సరే కానీ, జనులు బతుకుతెరువుకు అవలంభించవలసిన వృత్తులు ఏవి? వ్యవసాయం, వాణిజ్యం, పశు పోషణం మనకు ముఖ్య జీవనాధార వృత్తులు కదా! మనుషులు ఇందులో ఏ వృత్తిని నిర్వహించి జీవిస్తుంటారో అవే వారికి దైవస్వరూపాలు. అవే పూజార్హాలు. అవే అర్చించవలసినవి. మనం పశుపాలకులం. అడవులు, కొండలు మన ఉనికిపట్లు. గోసంపదే మన జీవనాధారం. కాబట్టి అడవులు పశువులు మనవేల్పులు.

ఇంకాఉంది