బిజినెస్

‘హల్వా ఉత్సవం’తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే 2016-17 సార్వత్రిక బడ్జెట్ పత్రాల ముద్రణ కార్యక్రమం ‘హల్వా ఉత్సవం’తో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ ఉత్సవంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పాల్గొన్నారు. సార్వత్రిక బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు పెద్ద బాణాలిలో హల్వాను తయారుచేసి ఆర్థిక శాఖ ఉద్యోగులందరికీ పంచడం చాలా కాలం నుంచి సాంప్రదాయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ వతల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్‌తో పాటు ఆ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు, సిబ్బంది ప్రస్తుతం సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. వీరందరికీ హల్వాను పంచడంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ముగిసి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వరకు వీరంతా కుటుంబాలతో సంబంధాలను తెగతెంపులు చేసుకుని ఆర్థిక శాఖ కార్యాలయంలోనే ఉండి తీరాలి. అప్పటివరకూ వీరిని తమ కుటుంబ సభ్యులతో గానీ, మిత్రులతో గానీ, ఇతర సన్నిహితులతో గానీ అనుమతించరు. కనీసం వీరు తమ ఆప్తులతో ఫోన్లు, ఇ-మెయిళ్ల ద్వారా సంప్రదింపులు జరిపేందుకు కూడా వీలుండదు. ఈ సమయంలో కేవలం ఆర్థిక శాఖలోని అత్యంత సీనియర్ అధికారులను మాత్రమే తమ ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికార పగ్గాలను చేపట్టిన తర్వాత రెండోసారి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి ఈ నెల 29వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్ ప్రెస్‌లో శుక్రవారం హల్వా ఉత్సవాన్ని నిర్వహించడంతో 2016-17 సార్వత్రిక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ ‘ట్వీట్’ చేశారు. ప్రస్తుతం బడ్జెట్ ముద్రణలో దాదాపు 100 మంది అధికారులు పాల్గొంటున్నారని, వీరందరినీ ఈ నెల 29వ తేదీ వరకు నార్త్ బ్లాక్ కార్యాలయంలోనే ‘బంధించడం’ జరుగుతుందని ఆయన తెలిపారు. స్వతంత్ర భారత దేశ తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26వ తేదీన ఆర్‌కె.షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు.