ఆంధ్రప్రదేశ్‌

రూ.2కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 22: కడప జిల్లా నుంచి గల్ఫ్‌దేశాలకు రాకపోకలు సాగిస్తున్న వ్యక్తులు ఒకేసారి కోట్లరూపాయలకు పడగెత్తాలనే దురాశతో మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల వ్యాపారంలోకి వెళ్తున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. శుక్రవారం ఈ వ్యవహారం బట్టబయలై రాయచోటి పోలీసులు హెరాయిన్ సరఫరాచేసే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ హెరాయిన్ విలువ రూ.2కోట్లు పైనే ఉంటుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన యువకులు హెరాయిన్, కొకైన్, బ్రౌన్ షుగర్‌ను ఇక్కడి స్మగ్లర్ల ద్వారా విదేశాలకు తీసుకెళ్లి కోట్లరూపాయల్లో వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సుండుపల్లె మండలంలోని ఒక యువకుడు, ఒంటిమిట్ట మండల కేంద్రంలోని ప్రసాద్, బాషా అనే యువకులు హెరాయిన్‌ను తెప్పించి, వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా కట్టి ఇక్కడి నుంచి గల్ఫ్‌దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మూడురోజుల క్రితం పోలీసులకు పక్కా సమాచారం అందడంతో రాయచోటి రూరల్ సిఐ రమేష్, సుండుపల్లె ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డిలు సుండుపల్లెలో హెరాయిన్ ఎగుమతికి సహకరిస్తున్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, హెరాయిన్‌ను గల్ఫ్‌దేశాలకు పంపుతున్నట్లు ఒప్పుకున్నాడు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని తీగ లాగతే డొంక కదిలింది.