హైదరాబాద్

రైల్వే స్టేషన్లు కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 10: సంక్రాంతి పండుగతోపాటు అయ్యప్ప స్వాముల రద్దీ ఎక్కువ కావడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని సికిందరాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లో ప్రయాణికుల రాకపోకలతో నిత్యం సందడి వాతావరణంతో రద్దీగా ఉంటున్నాయి. సంక్రాంతి పండుగకు నగరం సగం ఖాళీ కావడంతోపాటు వారం రోజుల పాటు నగరంలో నిత్యం రద్దీగా ట్రాఫిక్‌తో స్తంభించే రోడ్లు ఖాళీగా కనిపించడం కేవలం సంక్రాంతి పండుగ సమయంలోనే చూస్తాము. నగరం దాదాపు సగం ఖాళీ అవుతుంది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఏపికి తెరలివెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో నగరం నుంచి ఏపితోపాటు వివిధ రాష్ట్రాలకు తరలివెళ్లే అన్ని ప్రధాన రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు ఈ సీజన్‌లో దాదాపు 150 వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి వెల్లడించారు. అయ్యప్ప స్వాములు కేరళలోని అయ్యప్పస్వామి దేవాలయం శబరిమలకు తరలివెళ్లేందుకు ఈ మార్గంలో ప్రతి సంవత్సరం వందకుపైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. శబరిమల భక్తులు, అటు సంక్రాంతి పండుగకు బయలుదేరి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా ఉండడంతో ఏర్పాటు చేసిన రైళ్లు సంఖ్య ఎంతమాత్రం సరిపడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. రిజర్వేషన్‌లు చేసుకోవడానికి మూడు నెలల ముందే అవకాశం కల్పించినప్పటికీ గంటల వ్యవధిలోనే రిజర్వేషన్‌లు పూర్తయిపోయి వెయిటింగ్ లిస్టులు తప్పడం లేదు. దీంతో రిజర్వేషన్‌లు లేకపోయినా తప్పనిసరిగా తమ స్వగ్రామాలకు వెళ్లాల్సిన వారు రైల్వే ప్రయాణం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణించక తప్పని పరిస్థితి. మహిళలు చిన్నారులు ఇబ్బందులు పడుతూ ప్రయాణించక తప్పడం లేదు. వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో మరో వారం పదిరోజుల పాటు పండుగ ముందు తర్వాత వారం రోజులు కూడ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అధికారులు మరిన్ని సాధ్యమైనన్ని ప్రత్యేక రైళ్లను ఆయా డిమాండ్ ఉన్న మార్గాల్లో నడపాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. వెయిటింగ్ లిస్టు భారీగా ఉన్న రైళ్లలో రిజర్వేషన్ బోగీల్లో ఎక్కి ప్రయాణికులు వెళ్తుండడంతో రిజర్వేషన్ బోగీలు సైతం జనరల్ బోగీలను తరపిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత వరకు సదరు రైలుకు వెయిటింగ్ లిస్టు ఆధారంగా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తే సమస్యను కొంత వరకు పరిష్కరించినట్లవుతుంది ప్రయాణికులు కోరుతున్నారు. స్టేషన్లలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. స్టేషన్‌లను శుభ్రతను పాటిస్తూ క్లీనింగ్ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రైల్వే రద్దీని ఆసరాగా తీసుకుని ఇటు ప్రైవేటు ట్రావెల్స్ నడుపుతున్న బస్సులు, ఇతర వాహనాలు అందినంత దండుకుంటున్నాయనే ఆరోపణలు సైతం సర్వత్రా వినపడుతున్నాయి.