హైదరాబాద్

నుమాయిష్..జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వివిధ కంపెనీలు, బహుళజాతి సంస్థల ఉత్పత్తులకు నెలన్నర రోజుల పాటు మార్కెటింగ్ కల్పిస్తూ ఏర్పాటైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు క్రమంగా సందర్శకుల ఆదరణ పెరుగుతోంది. ప్రదర్శన ప్రారంభమై పదిరోజులు పూర్తయినా, గడిచిన నాలుగైదు రోజుల క్రితం గతంలో ఎన్నడూ లేని విధంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ప్రభావం పెరగటం, కొన్ని ముఖ్యమైన స్టాళ్లు అప్పట్లో అందుబాటులోకి రాకపోవటం వంటి కారణాలతో అంతంతమాత్రంగా కన్పించిన సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల నుంచే గాక, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల నుంచి కూడా ప్రదర్శనను తిలకించేందుకు సందర్శకులొస్తున్నారు. ఇక సెలవురోజైన ఆదివారం నుంచి సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసులు ఇప్పటి వరకు అనుసరించిన బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్, జోన్ పోలీసులే గాక, ప్రతిరోజు వివిధ పోలీస్‌స్టేషన్ల నుంచి సిబ్బందిని బందోబస్తుకు కేటాయిస్తున్నారు. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయగా, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రయివేటు మార్షల్స్‌ను నియమించి సందర్శకులను క్షుణ్ణంగా సోదా చేస్తుంది. సుమారు 2700పై చిలుకు ఉన్న స్టాళ్లలో సందర్శకులెక్కువగా గృహోపకరణ వస్తువులు, హ్యాండ్లూమ్స్, ఇతర రాష్ట్రాల సంప్రదాయ దుస్తులను కొనుగోలు చేయటంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. చిన్నారులు ఎక్కువగా చుక్ చుక్ రైలు, జాయింట్ వీల్స్, డేర్ డ్రైవర్స్, రేంజర్స్, బ్రేక్ డాన్సు, లాఫింగ్ క్లబ్‌లలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతలు కొడుతున్నారు. చిన్నారులను మరింత ఎక్కువగా ఆకట్టుకునేందుకు, ప్రదర్శనకు సందర్శకుల సంఖ్యలో పెంచేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ఈ సారి పెద్దనోట్ల రద్దు కారణంగా స్వైపింగ్ మిషన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. పలు కళా,సాంస్కృతిక సంస్థల చిత్రలేఖనాలు, శిల్పాలు, ఆధ్యాత్మికతను, యోగా, ధ్యానం ప్రాధాన్యతలను వివరిస్తున్న ప్రత్యేక స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
లోపల, బయటా నిఘా
ఒకవైపు నుమాయిష్ సందర్శకుల తాకిడి, మరోవైపు వేగంగా సాగుతున్న మెట్రో పనుల కారణంగా ప్రదర్శనకు ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చే అజంతా గేటు చౌరస్తాలో పోలీసులు పాదచారులకు తగిన భద్రతను కల్పిస్తున్నారు. రోడ్డు దాటడం గగనంగా మారిన ఈ చౌరస్తాలో అటు బిజెపి కార్యాలయం వైపు, ఇటు అజంతా గేటు వద్ధ ప్రత్యేక నియమించిన ట్రాఫిక్ పోలీసులు ఎస్కార్ట్స్‌తో ఇరువైపులా సిగ్నల్ మెయింటేన్ చేస్తూ పాదచారులను రోడ్డు దాటిస్తున్నారు. దీంతో పాటు గాంధీభవన్ వెనక నుంచి ఉన్న ఎంట్రెన్స్ వద్ద కూడా పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తున్నారు.