హైదరాబాద్

బాండ్ల జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: మహానగర పాలక సంస్థకు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఒకవైపు ప్రజలపై పన్నులు పెంచుకుండానే అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆర్థిక వనరులతో ఆదాయాన్ని పెంచుకోవటంతో పాటు పెద్ద మొత్తంలో నిధుల సమీకరణకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి. బాండ్ల జారీతో నిధులను సమీకరించుకోవాలని భావించిన జీహెచ్‌ఎంసీ ఇప్పటికే కేర్, ర్యాంక్ ఇండియా సంస్థలతో రేటింగ్ చేయించగా, ఏఏ ప్లస్ ర్యాంక్ వచ్చింది. సమర్థవంతమైన పరిపాలన, తిరిగి చెల్లించే ఆర్థిక సామర్థ్యం కలిగిన దేశంలోని పది స్థానిక సంస్థల జాబితాలోకి జీహెచ్‌ఎంసీ చేరింది. దీంతో బాండ్ల జారీకి స్టాట్ ఎక్స్ఛెంజీ నిబంధనలకు సైతం జీహెచ్‌ఎంసీకి అర్హత పొందింది. ఏఏ ప్లస్ రేటింగ్ ర్యాంకుతో ఇప్పటి వరకు పూణే స్థానిక సంస్థ బాండ్లను జారీ చేయటంతో అదే విధానాన్ని జీహెచ్‌ఎంసీ అనుసరించనుంది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలకు బాండ్లను జారీ చేయాలని అధికారులు భావించారు. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో బాండ్లు జారీ చేస్తే వడ్డీ భారం పెరిగే అవకాశముందనే విషయాన్ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ అవసరానికి తగిన విధంగా విడతలవారీగా బాండ్లను జారీ చేసి వెయ్యి కోట్ల రూపాయలును సమకూర్చుకోవాలని భావిస్తోంది. కొద్దిరోజుల క్రితం ముంబయిలో 13 ఆర్థిక సంస్థలతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీకి వెళ్లారు. సెబీ ప్రమాణాలతో ఎక్స్ఛేంజీని ఫండ్స ప్రొవైడర్‌గా నియమించుకున్నారు. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు చక్కటి ఆదరణ వచ్చిందని తెలిపారు. నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టు కోసం తొలి దశగా రూ.200 కోట్లకు బాండ్లను జారీ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. బాండ్ల జారీకి అరెంజర్లుగా నియమించిన సంస్థలకు ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. బాండ్ల జారీ, నిధుల సమీకరణ కోసం అరేంజర్లుగా ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, ఎస్‌పీఏ క్యాపిటల్ అడ్వైజర్ లిమిటెడ్ సంస్థలను నియమించుకుని, తొలి దశ రూ.200 కోట్ల విలువైన బాండ్ల జారీకి బుధవారం కుదిరిన ఒప్పందంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి సంతకాలు చేసినట్లు అధికారులు తెలిపారు.