బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్స్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో స్థిరాస్తి ప్రదర్శన మొదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ డెవలపర్లు ఎంపిక చేసిన 3,500 పైచిలుకు స్థిరాస్తులను ప్రదర్శించారు. ఇళ్ళ కొనుగోలుదారులకు లాభదాయకంగా హైదరాబాద్ నగరంలోని స్థిరాస్తులకు సంబంధించి ప్రముఖ మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ‘రెడీ టు ఆక్యుపై హోమ్స్ షోకేస్’ నినాదంతో ఈ స్థిరాస్తి ప్రదర్శనను ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శనను హెచ్‌డిఎఫ్‌సి మెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్ మాథ్యూ జోసెఫ్ రాయదుర్గంలోని నార్నె రోడ్డులోగల జెఆర్‌సి కనె్వన్షన్స్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్ వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామ్‌రెడ్డి, క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, హెచ్‌డిఎఫ్‌సి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాపార అధిపతి రాజన్ టాండన్, హెచ్‌డిఎఫ్‌సి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాపారాభివృద్ధి అధిపతి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం కూడా జరిగే ఈ ప్రదర్శన ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది.