బిజినెస్

ఒక్కో హెచ్-1బి వీసాకు చెల్లించేది 8వేల డాలర్ల పైమాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 19: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దాదాపు అన్ని భారతీయ ఐటి రంగ సంస్థలు హెచ్-1బి వీసాలకు ఒక్కోదానికి 8,000 డాలర్ల నుంచి 10,000 డాలర్లు చెల్లించాల్సి రానుంది. ఏటా ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బి వీసా దరఖాస్తులు మొదలవుతాయి. వీసాలకు సంబంధించి ఏవైనా మార్పులు తెస్తే అప్పటి నుంచే వర్తింపజేస్తుంది అమెరికా. దీంతో ఏప్రిల్ 1 నుంచి పెంపు వర్తించనుంది. నిజానికి హెచ్-1బి వీసా దరఖాస్తు ధర 325 డాలర్లు మాత్రమే. దీనికి ప్రివెన్షన్, డిటెన్షన్ ఫీజుగా 2005 మార్చిలో అదనంగా మరో 500 డాలర్లు చేరింది. 25 మందికిపైగా ఉద్యోగులకు వీసాలు కావాల్సి వస్తే ఒక్కోదానికి 1,500 డాలర్లు చెల్లించాలి. ఈ క్రమంలో ఇప్పుడిది 8,000 డాలర్లను మించిపోయింది. ఇది భారత ఐటి సంస్థలపై పెను భారం మోపనుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం 1.8 ట్రిలియన్ డాలర్ల వ్యయ బిల్లుపై సంతకం చేశారు.
జనవరి 2 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
* మంత్రి పరిటాల సునీత
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 19: జనవరి 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. కొత్త రేషన్ కార్డులతో కలిపి 1.41 కోట్ల మంది కార్డుదారులకు 6 సరుకులతో కూడిన చంద్రన్న సంక్రాంతి కానుక ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతపురంలో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ సంక్రాంతి కానుక సంచిలో కిలో గోధుమపిండి, అర కిలో బెల్లం, అర కిలో శనగ పప్పు, అర లీటర్ పామాయిల్, అర కిలో కందిపప్పు, 100 మిల్లీలీటర్ల నెయ్యి ఉంటాయన్నారు. వీటి విలువ రూ. 275 అవుతుందని, అయితే కార్డుదారులకు ఉచితంగా అందజేస్తామన్నారు. ఇందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు.
గిరిజన వర్సిటీ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
కొత్తవలస, డిసెంబర్ 19: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని శనివారం కేంద్ర బృందం పరిశీలించింది. రాజ్‌శ్రీసింగ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కేంద్ర బృందం రెల్లి రెవెన్యూ పరిధిలోని సుమారు 450 ఎకరాలను పరిశీలించింది. ఆర్థిక, పర్యావరణ, అర్కిటెక్చర్ నిపుణులు ఇక్కడున్న వసతులను పరిశీలించారు. రోడ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం, ప్రజల నుండి సహకారం వంటి అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వారు చర్చించారు.