Others

శాశ్వతమైనది ఎప్పుడూ ఆనందమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు బట్టి మనిషి, మనిషిని బట్టి మనసు ఉంటాయంటారు. ఎవరైనా సరే అంతరాత్మ చెప్పినట్టు నడుచుకుంటారు. కొందరు మాత్రమే అంతరాత్మ చెప్తున్నా వినకుండా ఇంద్రియాలు ఆడించినట్టు ఆడుతుంటారు. అటువంటివారికి కొన్నాళ్లు సుఖంగా ఉన్నట్టు ఉన్నాసరే వారు కష్టాల కడలిలో మునిగి పోయేవారే అని ఎదుటివారికి అనిపిస్తుంటుంది. ఈ కష్టం అనేది కూడా భావనకు సంబంధించినదే కాని మనసుకు సంబంధించింది కాదు. మనసు బాగాలేదు అంటుంటారు. కాని మనసు కాదు భావన బాగలేదు. మంచి భావనలతో మనిషి ఆలోచిస్తున్నపుడు ఎదురుగా కనిపించేదంతా ఆనందంతో ఉన్నట్లు కనిపిస్తుంది. అలలతో ఉన్న సముద్రాన్ని చూసినా సంతోష కెరటాలు ఎగిసిపడుతున్నట్టు అనిపిస్తుంది. ఆకాశంలోకి ఎగిరే పక్షి కనిపించినా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బుయై ఉన్నతలోకాలకు పయనం సాగిస్తోంది కదా అని అంటాడు. కష్టపడి నిలువెత్తు పరత్వం ఎక్కుతున్నా కష్ట్ఫేలి కనుక విజయం తప్పక సిద్ధిస్తుంది అనే తత్వం తనకు ఎరుక పడినట్లుగా భావిస్తాడు. అదే దుఃఖభావనలతోను, నిరాశనిస్పృహలతో ఉన్నప్పుడు సముద్రం దుఃఖసాగరంలాగా కష్టాలనే కెరటాలు అల్లకల్లోలం చేస్తున్నట్లు భ్రమిస్తాడు. ఆకాశంలో ఎగిరే పక్షిని చూచి ఏముంది ఎంత ఎత్తు ఎదిగినా మళ్లీ నేలకు రాలాల్సిందే కదా అంటాడు. అదృష్టం అనేది లేనప్పుడు కష్టం కన్నీటి తప్ప ఏదీ ఇవ్వదు అని స్థితికి దిగజారుతాడు. అంటే ఇదంతా మనిషి మనసుకాని, బుద్ధి కాని చెప్పే సంగతులు కావు అతని ఆలోచనావిధానమే. ఈ విధంగా మనిషిని ఊహాలోకాలకు కొనిపోతూ ఉంటుంది. ఇంద్రియ విషయ లోలుడుకాక ఆత్మనిగ్రహంతో బుద్ధి బలంతో ఆధ్యాత్మికంగా ఆలోచించగలిగినాడు ఆలోచన్లో సమస్థితి ఏర్పడుతుంది. ఆపైన స్థితప్రజ్ఞత వస్తుంది. సుఖదుఃఖాలు రెండూ అశాశ్వతమైనవని తెలుసుకొంటాడు. శాశ్వతమైనది ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్న సత్యాన్ని గ్రహించగలుతాడు.