అనంతపురం

హర హర మహాదేవ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం , మార్చి 7: హరహర మహాదేవ..., ఓం నమశ్శివాయ... అంటూ భక్తుల శివనామస్మరణతో నగరంలోని శివాలయాలు మార్మోగాయి. అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం నగరంలోని శివాలయాల్లో పరమశివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉపవాసాలతో పరమశివుని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తుల తాకిడితో ఆలయాలు కిటకిటలాడాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పురాతన శ్రీ విరూపాక్షేశ్వర ఆలయంలో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు బారులుతీరి శివలింగ దర్శనం చేసుకున్నారు. మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో శివలింగానికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతులను నంది వాహనంపై పురవీధులలో ఊరేగించారు. అర్ధరాత్రి గిరిజా కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు బారులుతీరి నిలబడి శివలింగ దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. కొత్తూరు అమ్మవారిశాలలో మంచు లింగం ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పాతవూరు అమ్మవారుశాలలో శివలింగాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించి, ఐశ్వర్యేశ్వరునికి పూజలు నిర్వహించారు. నగర సమీపంలోని ముసలమ్మకట్ట వద్ద గల శ్రీ కాశీవిశే్వశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, స్వామివారిని అలంకరించారు. హెచ్చెల్సీ కాలనీ మంజునాథ స్వామి ఆలయంలో ఐశ్వర్యేశ్వరునికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శృంగేరి శారదా శంకరమఠం, శివకోటి ఆలయం, గీతా మందిరంలోని శివాలయం, అరవింద నగర్‌లోని సర్వేశ్వరాలయం, మారుతినగర్ శివాలయం, లక్ష్మీనగర్ శివాలయం, సంగమేష్ నగర్ కాశీవిశే్వశ్వరాలయం, ఆరో రోడ్డు అమృతలింగేశ్వరాలయం, ఆజాద్‌నగర్ కాశీవిశే్వశ్వరాలయాలలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో లలిత కళాపరిషత్‌లో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైతన్య మూర్తుల అలంకారాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరై వేడుకలను తిలకించారు. మూడో రోడ్డు జిఆర్ ఫంక్షన్ హాలులో అనంత శివారాధన సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాశీవిశే్వశ్వర లింగమునకు సామూహిక జలాభిషేకం, గిరిజా కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి ఆత్మవిదానంద, గొంగడి రామప్ప, అనంత పద్మనాభ, పాలసముద్రం నాగరాజు, బుగ్గేష్, చంద్రశేఖర్, చలపతిరెడ్డి, వాసవీ ప్రభాకర్, రాంభూపాల్, ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.