తెలంగాణ

నాటిన ప్రతి మొక్కా బతకాలి: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని, నాటిన ప్రతి మొక్కా బతికేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం నల్గొండ జిల్లాలో ప్రారంభించారు. చౌటుప్పల్ మార్కెట్ యార్డులోను, గుండ్రాంపల్లి గ్రామంలోనూ ఆయన మొక్కలు నాటారు. మొక్కలను పెంచితే వర్షాలు బాగా కురిసి పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. అడవులను నాశనం చేయడం వల్లే తెలంగాణలో దుర్భిక్షం ఏర్పడుతోందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని, రాష్ట్రంలో ఇకముందు విద్యుత్ కోతలు ఉండవన్నారు. హరితహారం కార్యకమాన్ని హెలికాప్టర్ ద్వారా వీక్షించాలని ఆయన భావించినప్పటికీ గుండ్రాంపల్లి నుంచి కోదాడ వరకూ విహంగ వీక్షణం జరిపి, ఆ తర్వాత వర్షం కారణంగా నార్కట్‌పల్లి నుంచి వెనుదిరిగారు.