జాతీయ వార్తలు

వేధింపులు రుజువు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరకట్న మరణాలపై సుప్రీం రూలింగ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఓ మహిళ అకాల మరణం వరకట్న వేధింపుల కారణంగానే జరిగిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు, రుజువులు ఉండాలని సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. వరకట్న వేధింపుల కారణంగానే ఓ మహిళ అసాధారణ మరణానికి గురైందని నిర్ధారించాల్సింది కోర్టులేనని, ఇందుకు సంబంధించి ఐపిసిలోని 304బి సెక్షన్‌ను పరిగణలోకి తీసుకోవల్సి ఉంటుందని న్యాయమూర్తులు విక్రమ్‌జిత్ సేన్, ఆర్‌కె అగర్వాల్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఐపిసి 304బి సెక్షన్ ప్రకారం ఓ మహిళ అకాల మరణానికి ముందు వరకట్న వేధింపులకు గురైందన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. అయితే మరణానికి ముందు అన్న మాటకు సరైన నిర్వచనం లేదని స్పష్టం చేశారు. మరణానికి ఎంత ముందు కాలం నుంచి సదరు బాధితురాలు వరకట్న వేధింపులకు గురైందన్న విషయాన్ని అనేక అంశాల ప్రాతిపదికగా కోర్టులో నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. 1996లో హర్యానాలో జరిగిన ఓ వరకట్న మరణానికి సంబంధించిన కేసులో నిందితుడు కరమ్‌వీర్ ఆయన తల్లికి దిగువ కోర్టు విధించిన శిక్షను ధృవీకరించిన సందర్భంగా ధర్మాసనం ఈ రూలింగ్ ఇచ్చింది.