భక్తి కథలు

హరివంశం - 67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారు. ఆయన పాడితే వాళ్ళు ఆడుతున్నారు. ఆయన మురళి మోవిపై ఆనిస్తే కరతాళ మృదంగ భంగిమలతో విలాస నర్తనలు చూపుతున్నారు. ఆయన పట్ల వారు బద్ధానరాగలైనారు. ఆయన వలపు చూపుల కోసం పరితపించిపోతున్నారు. ఆయన వేణువు చేత బట్టి ఆవుల వెంట వన వీధులలో సంచరిస్తూ వుంటే గోప భామలు కూడా ఆయన గోవుల వెంట తామూ అనుసరిస్తున్నారు.
ఆయన చూపు తమ మీద ప్రసరించాలని మరి మరి వేడుక పడుతున్నారు. మరింత అలంకరించుకుంటున్నారు. శ్రీకృష్ణుడి అతిలోక మోహన సౌందర్యం పట్ల గోప వనితలు అత్యంత అనురాగవతులైనారు. కందర్ప శర విద్ధలైనారు. ఆయన తనను ఆరాధించే వారి పట్ల రక్తుడు, అనురక్తుడు, సంప్రీతుడు కాబట్టి వాళ్ళ కామితం ఈడేర్చాలని భావించాడు.
అపుడు ఒక్కొక్క గోపికకు ఒక్కో కృష్ణుడిగా తన మహిమ చూపాడు. ఇద్దరు అంగనల మధ్య ఒక కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్య ఒక సుందరాంగనగా మురళీకృష్ణుడు మండలాకార క్రీడ సలిపాడు. మళ్లీ ఈ మండల మధ్యంలో ఇంకొక శ్రీకృష్ణుడు మురళినూదుతున్నాడు. వాళ్ళను కౌగిలింతలో మురిపించాడు కృష్ణుడు. ముద్దాడి మోహపరవశలను చేశాడు.
వాళ్ళను ఎత్తుకున్నాడు. ఎదకు హత్తుకున్నాడు. వాళ్ళతో దాగుడుమూతలాడాడు. వాళ్ళను తన భుజాలమీద మోశాడు. ఇట్లా దేవతలకే అత్యంతాశ్చర్యకర ప్రమోద జనకంగా ఆయన రాసక్రీడ విరచించాడు. వాళ్ళతో యమునా నదిలో జలక్రీడలాడాడు. దీనిని బట్టి గోపకాంతలను కూడా ఆయన సృష్టించుకున్నాడని అర్థమవుతున్నది. తనను తాను పెక్కు రూపుల సృష్టించుకోలేదా!? రాసక్రీడ వర్ణనవల్ల అర్థం చేసుకోవలసింది ఏమంటే ఆయనను నమ్ముకున్న వారికి, కొలుచుకున్నవారికి, భావ స్థితం చేసుకున్నవారికి చతుర్విధ పురుషార్థదాయకుడు, ఫలప్రదాయకుడుని భావించాలి. ఈ సన్నివేశాలను, సంఘటనలను శృంగారోజ్జ్వలితం చేయటం ఎందుకంటే శృంగారం రసరాజం. శృంగారం అంటేనే రస శిఖరాధిష్ఠితం అని దాని పేరే చెపుతున్నది. శృంగారం లేనిది సృష్టి లేదు. ఆయన సృష్టి స్థితి లయరూపకుడు. నిరూపకుడు. ‘్ధర్మాతిరుద్ధకామోస్మి’ అని తనను అభివర్ణించుకున్నాడు కృష్ణుడు. ‘గోప స్ర్తి పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ’ అని లీలాశుకుడు అన్నా, అయ్యో గోపికల భక్తి, ఆత్మార్పణం నాకెక్కడిది? అని ఉద్ధవుడు భావించినా, నేను రాధను కాలేకపోయినాని రామకృష్ణ పరమహంస పరితపించినా గోపికా క్రీడల ప్రతీకాత్మకతను వారు సంభావించి చెపుతున్నట్లు. కాముడి (కుసుమశరుడి) తండ్రిని కామించిన వారి కామితార్థాలు ఈడేరుస్తాడనీ, తృతీయ పురుషార్థానికి కూడా ఫలదేవత, అధిదేవత శ్రీకృష్ణుడేననీ బోధించటమేననీ ఇది అని పరమార్థ విధుల భావన). ఈ విధంగా శరద్రాత్రులు అనుదిన ఆనంద సంధాయకాలుగా అవుతుండగా కంసుడి పనుపున అరిష్టుడనే రాక్షసుడు అర్థరాత్రి సమయంలో రాసక్రీడాపరాయణుడైన కృష్ణుణ్ణి సుకరంగా నిర్జించవచ్చునని, వ్రేపల్లెను భయభ్రాంతం చేయడానికి పూనుకున్నాడు. తనకు రాబోయే మృత్యువు అనుచరులుగా ఆ రాక్షసుడిలో ముందుగా కోపమూ, పాపమూ చెలరేగాయి.
శ్రీకృష్ణుడు శృంగార లీలా వినోదుడై ఉన్నపుడు ఆయనను భంగించటం సులభమనీ, ఆయన ఎమరి ఉంటాడనీ, శత్రువును ఎదుర్కోలేడనీ, ఆయన దగ్గర అప్పుడు శస్త్రాస్త్రాలు ఏమీ ఉండవని ఆ బుద్ధిహీనుడు తలచాడు. పెద్ద పెట్టున విజృంభించాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు