భక్తి కథలు

హరివంశం- 84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీతో వాళ్ళకు జెట్టి పోరు సంఘటింపచేస్తున్నాను. ఏదో మాయా ప్రావీణ్యం చూపాలని వాళ్ళు చూస్తారు. కాని మీరు వాళ్ళ ఆటలు సాగనియ్యవద్దు. వాళ్ళను ఒక్క యేటున మీరు విగతజీవుల్ని చేయాలి అని కంసుడు తమను పెద్ద చేసి తన అక్కర తీర్చవలసిందిగా వేడుకోవటం ఆ మల్లయుద్ధ విద్యావిశారదులకు ఎంతో వేడుక కలిగించింది. ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఉప్పొంగజేసింది. కంసుడంటి గొప్పవాడు, మహారాజు, ఎవరికీ తేరిచూడరానివాడు తమను బతిమాలుకుంటున్నాడని వాళ్ళు కంసుడికి నమస్కరించి భుజాలు చరచుకొని, హుంకరించి తామప్పుడు కృష్ణుణ్ణి మల్లయుద్ధంలో జయించినట్లు విర్రవీగారు.
మహారాజా? చూస్తూ ఉండండి! మీ అభీష్టం ఎట్లా సిద్ధింపజేస్తామో అని తొడలు చరచుకొని, దీనికోసం మీరింత దిగులు పడటం ఎందుకు? గోటితో చీరేస్తాం ఆ గోపాల బాలురను, రేపీపాటికి మీరే చూస్తారు అని బీరాలు పలికారు ఆ జెట్టి మల్లులు. అపుడు కంసుడు వారికి కొన్ని మల్లయుద్ధ రహస్యాలు, నేర్పులు తెలియజేసి ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళను వీడ్కొలిపాడు. ఆ తరువాత కంసుడు తన రాచకార్యాలన్నీ ఎంతో దక్షతతో నిర్వహించే మహామాత్యుణ్ణి తన సమక్షానికి రప్పించుకున్నాడు. అతడితో ఇట్లా అన్నాడు. ‘నీవు నాకు అత్యంతాప్తుడవు. నమ్మకస్తుడవు. ఎంతో ప్రజ్ఞాశాలివి. గజారోహణ నైపుణ్యంలో నీకు సాటివచ్చేవాడు ఇంకొకరు లేరు. ఎటువంటి మదగజమైనా నీ స్వాధీనంలో ఉంటుంది.
ఎట్లా చెపితే అట్లా వింటుంది. నా గజబలానికంతా నీవే అధిపతివి. నీవు నాకు అత్యంత ఆంతరంగిక సచివుడివి. మహామాత్యుడివి. నీ వల్ల మాత్రమే కాగల పని ఒకటి ఇపుడు నాకు వచ్చింది. నీ మీదనే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇపుడు మధురకు బలరాముడు, కృష్ణుడు అని దుండగీండ్రు ఇద్దరు వచ్చారు. వాళ్ళు పాపాత్ములు. ఎటువంటి ఘోరానికైనా వెనుతీయరు. వాళ్ళను బలహీనులనుకోవద్దు. ఏదో విధంగా వాళ్ళ పీడ వదిలించుకోవాలి నేను. మన మల్లులను కూడా ఇందుకోసం నేను ఆయత్తం చేశాను. చాణూరుడు ముష్టికుడు సామాన్య మల్లులా! ఇంతవరకు వాళ్ళను ఎదుర్కోగలవారెవరూ ఈ పృధివిలో లేరు. రామకృష్ణులు మల్ల రంగానికి ఈ దారినే వస్తారు. ముందుగా రాజసౌధానికి వచ్చి నన్ను దర్శిస్తారు. నీవు రాజ భవనపు సింహద్వారం దగ్గర మన కువలయాపీడాన్ని సిద్ధం చేసి ఉంచు. ఆ బలరామకృష్ణుల దగ్గర అపుడు ఆయుధాలు ఏమీ ఉండవు కదా! ఒడుపుగా వాళ్ళపైన మన పట్టపుటేనుగును పురికొల్పాలి. బాగా రెచ్చగొట్టాలి. అది కనక రేగిపోయి వాళ్ళను పాదాలతో మట్టుపెట్టిందా నేనిక నిర్భయంగా యాదవులందరినీ అణచిపారేస్తాను. వసుదేవుణ్ణి చంపివేస్తాను. దేవకి కూడా ఈ దుఃఖభారం మోయలేక మరణిస్తుంది. అప్పుడు నాకు యాదవ రాజ్యమంతా సొంతమవుతుంది.
నాకు యాదవులంటే జన్మ వైరం సుమా! అందుకే గదా ఉగ్రసేనుణ్ణి పట్టి బంధించి చెరలో వుంచాను. ఒక రహస్యం చెపుతాను విను. ఉగ్రసేనుడు నా తండ్రి కాడు. నేనాయనకు జన్మించలేదు. ఉగ్రసేనుడంటే యాదవు కులాల వారందరికీ గొప్ప అభిమానం. నన్ను ఎట్లా అడ్డు తొలగించుకుందామా? అని వాళ్ళంతా ఎదురుచూస్తున్నారు. ఉగ్రసేనుడు నా తండ్రి కాడన్నాను కదా! ఈ రహస్యం నాకు నారదుల వారొచ్చి స్వయంగా చెప్పబట్టి తెలిసింది. ఉగ్రసేనుడికే నేను పుట్టి ఉంటే నాకింతటి ఘోర వరబల పరాక్రమాలెక్కడినుంచి వచ్చేవి. ఆ రహ్యమేమిటో చెపుతాను విను.

- ఇంకా ఉంది

అక్కిరాజు రమాపతిరావు