తెలంగాణ

చింతలేని గ్రామంగా చింతమడక:హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: చింతలేని గ్రామంగా చింతమడక తీర్చదిద్దబడుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆయన చింతమడకలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తున్నపుడు ఇక్కడ ఒక్క పొయ్యి కూడా వెలగలేదని, చింతమడక కేసీఆర్‌కు బాసటగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్ రాకతో దసరా, దీపావళి, బతుకమ్మ ఇలా అన్నీ పండుగలు ఒకేసారి వచ్చాయని అన్నారు. గ్రామంలో ప్రతిఒక్కరికి ఉపాధి కల్పిస్తామని, ఇళ్లులేని వారికి ఇళ్లు, రహదారుల నిర్మాణం చేస్తామని చెప్పారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నిధులు మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు.