సంపాదకీయం

హరిత నిష్ఠకు అద్దం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి మొదలయ్యే 2016-17 ఆర్థిక సంత్సరానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆదాయ వ్యయ ప్రణాళిక-బడ్జెట్-ప్రగతికి ప్రతిరూపం! తాత్కాలిక ప్రయోజనం సిద్ధించగల సంక్షేమ కార్యక్రమాలకంటే దీర్ఘకాల ప్రయోజనం సిద్ధించగల ప్రగతి పథకాలకు బడ్జెట్‌లో ప్రా ధాన్యం ఇచ్చారు. ప్రణాళికా వ్యయం ప్రగతికి ప్రాతిపదిక, ప్రణాళికేతర వ్యయం సంక్షేమానికి ప్రతీక! బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం కంటె ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండగలదని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రచారం చేసింది! అందువల్ల సోమవారం నాడు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినప్పుడు ఎక్కువమందికి ఆశ్చర్యం కలిగి ఉండదు. అయినప్పటికీ ఈ అద్భుతం ఆధికారికంగా ఆవిష్కృతం కావడం చారిత్రక పరిణామం! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లలో ప్రణాళికా వ్యయం కంటె ప్రణాళికేతర వ్యయం ఎక్కువగా ఉండడం దశాబ్దులుగా కొనసాగుతున్న ఆర్థిక చరిత్ర! ప్రణాళికా వ్యయం మొత్తం బడ్జెట్‌లో నాలుగవ వంతుగాను, ప్రణాళికేతర వ్యయం నాలుగింట మూడు వంతులుగాను ఉండిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టప్రు చివరి బడ్జెట్-2013-14వ సంవత్సరపు ఆదాయ వ్యయపత్రం-పరిమాణం దాదాపు లక్షా అరవై రెండు వేల కోట్ల రూపాయలు కాగా ప్రణాళికకు దాదాపు అరవై వేల కోట్లు కేటాయించారు, ప్రణాళికేతర వ్యయానికి లక్షా రెండు కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ప్రణాళికా వ్యయం మొత్తం బడ్జెట్‌లో ముప్పయి ఎనిమిది శాతం కంటె తక్కువ. 2014 ఫిబ్రవరిలో రూపొందిన ఉమ్మడి రాష్టప్రు తాత్కాలిక ఆదాయ వ్యయ ప్రణాళిక పరిమాణం దాదాపు లక్షా ఎనబయి మూడు వేల కోట్లు. ఇందులో ప్రణాళికా వ్యయం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రం...అంటే దాదాపు ముప్పయి ఆరు శాతం! ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2016-17వ సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌లో కూడ మొత్తం ఖర్చులో ప్రణాళికా వ్యయం ముప్పయి ఆరు శాతం మాత్రమే! కేంద్ర ప్రభు త్వం వారి 2016-17వ సంవత్స రం బడ్జెట్‌లో సైతం ప్రణాళికా వ్యయం దాదాపు ఇరవై తొమ్మి ది శాతం. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇప్పటికే ప్రణాళికా వ్యయం ముప్పయి శాతంగాను, ప్రణాళికేతర వ్యయం డెబ్బయి శాతం గాను కొనసాగుతుండడం దీర్ఘకాల ప్రగతి కంటె తాత్కాలిక ప్రజాకర్షక పథకాలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం..ఎన్నికల ముందు ప్రతిపాదించే బడ్జెట్‌లలో ఇలాంటి తాత్కాలిక ప్రజాకర్షక సంక్షేమ పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం అధికార పక్షాల విజయవ్యూహంలో భాగం! ఈవైపరీత్యానికి స్వస్తి చెప్పడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు విప్లవాత్మకమైన వినూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది! దాదాపు లక్షా ముప్పయి ఒక్కవేల కోట్ల రూపాయల మొత్తం వ్యయంలో ప్రణాళికా వ్యయం అరవై ఎనిమిది వేల కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం అరవై మూడు వేల కోట్ల రూపాయలు. ఇలా మొదటిసారిగా ప్రణాళికేతర వ్యయం కంటె ప్రణాళికా వ్యయం పెరగడం చారిత్రక ఘట్టం!
గ్రామీణ ప్రగతికి వ్యవసాయ విస్తరణకు బడ్జెట్ అత్యధిక ప్రాధాన్యం లభించడం మరో హర్షణీయ పరిణామం! ఈ వాస్తవం మాటలకు మాత్రమే పరిమితం కాక ఆచరణగా ప్రస్ఫుటిస్తోందనడానికి కొత్త బడ్జెట్ మరో నిదర్శనం. హరిత హారం, కాకతీయ మిషన్ వంటి పథకాల ద్వారా ఆకుపచ్చని సీమగా తెలంగాణను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది! నీటిపారుదల రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించడం తెలంగాణ ప్రభుత్వపు హరిత నిష్ఠకు నిదర్శనం. గోదావరి కృష్ణ నదులలో లభిస్తున్న తెలంగాణ వాటా జలాలను పూర్తిస్థాయిలో పొలాలకు మళ్లించడానికి ఈ నిధులు ఉపయోగపడవచ్చు. నీటిపారుదలకు ఇరవై రూ. 5 వేల కోట్లు కేటాయించడం కాళేశ్వరం పాలమూరు వంటి ఎత్తిపోతల పథకాలకు దాదాపు రూ.15 వేల కోట్లు వ్యయించాలని నిర్ణయించడం ఆకుపచ్చని పొలాలను విస్తరింపచేయడానికి దోహదం చేస్తుంది! గోదావరి దాని ఉపనదులైన పెన్‌గంగ ప్రాణహితలపై నిర్మించడానికి వీలైన ఆనకట్టల విషయంలో మహారాష్టత్రో ఒప్పందాలను కుదుర్చుకోగలిగిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను జాప్యం లేకుండా పూర్తి చేయగలదన్న విశ్వాసం ఈ కేటాయింపుల ద్వారా చిగురించింది. తెలంగాణను విత్తన భాండాగారంగా మార్చాలన్న సంకల్పం నెరవేరినట్టయితే స్థానిక రైతుల బంగారు కలలకు సమృద్ధి రూపం ఏర్పడుంది.
నిరుపేదలకు పూర్తి ప్రభుత్వపు ఖర్చులతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించడానికి, రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు సరఫరా చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం భరత మాతకు మరో నీటి వడ్డాణం! ఆహారం, ఆచ్ఛాదన-ఈ రెండు మానవజీవన ప్రస్థాన క్రమంలో రెండు చక్రాలు! ఈ చక్రాల బండి వేగం పుంజుకొంటోందనడానికి కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు సాక్ష్యాలు! హైదరాబాద్‌లో లక్ష కుటుంబాలకు రాష్ట్రంలో మరో లక్ష కుటుంబాలకు 2016-17లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నారట! మురికి వాడల నరకంలో దోమలతో సహజీవనం చేస్తున్న నిరుపేదలు ఇంటివారు కావడానికి కృషి చేయడం నిజమైన ప్రగతి నిష్ఠ! ఇల్లు కట్టి చూడు అని సలహాలు ఇవ్వడం కాక తెలంగాణ ప్రభుత్వం ఇళ్లను కట్టిస్తోంది! ఇంటింటా నల్లాలలో నీరు ప్రవహించడానికి వీలు కల్పిస్తున్న భగీరథ ఉద్యమానికి దాదాపు రూ. 37 వేల కోట్లు కేటాయించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది! విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా నిరంతరం నివాస గృహాలను వెలిగించడానికి మాత్రమేకాక, వ్యవసాయ భూము ల నీటపారుదల కోసం ప్రతిరోజు తొమ్మిది గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేస్తారట! ఇలా భూమి, నీరు కేంద్ర బిందువులుగా బడ్జెట్ రూపొందడానికి ప్రాతిపదిక ప్రణాళిక వ్యయం భారీగా పెరగడం. పండ్లు, కూరగాయల సాగుకో సం ప్రత్యేకంగా పండ్ల తోటల అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం ముదావహం! ప్రాకృతికమైన ఎరువులను ఉత్పత్తి చేసే వారికి ప్రోత్సాహం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం సేంద్రీయ వ్యవసాయ విస్తరణకు దోహదం చేయలగలదు!
అన్నివర్గాలను ప్రగతి సూత్రంతో ఏకీకృతం చేయడంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉంది! అన్ని సామాజిక వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను పెంచింది! అగ్రవర్ణంగా ముద్ర పడి ఆర్థికంగా అణగారిపోతున్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి సైతం తెలంగాణ ప్రభుత్వం వందకోట్ల రూపాయల సంక్షేమ నిధిని కేటాయించడం హర్షణీయం! బ్రాహ్మణ సంక్షేమంతో ఆర్థిక ప్రగతి మాత్రమే కాక సమాజంలోని అన్ని వర్గాల ధార్మిక సుగతి కూడ ముడివడి ఉంది! దేవాలయ అర్చక వ్యవస్థ పౌరోహిత్యం గ్రామాలలో అడుగంటిపోవడం గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల ప్రజలనూ అలజడికి గురి చేస్తున్న విపరిణామం! పురోహితుడంటే ధర్మమార్గంలో ముందు నడిచేవాడు-కానీ తిండికోసం అలమటించిన పురోహితులు పట్టణాలకు పారిపోయారు. పురోహితుడు లేని గ్రామాల్లో ఈ సమస్య ప్రతినిత్యం ఎదురవుతోంది! అర్చకుడు లేక గుడులు మూతపడి ఉన్నాయి. బ్రాహ్మణ సంక్షేమం గ్రామాలలో మళ్లీ పురోహితుడిని అర్చకుడిని నిలబెట్టడానికి దోహదం చేయాలి! ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టగలగాలి.