భక్తి కథలు

హరివంశం-89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంసుడు ఆపాదమస్తకం దహించుకొనిపోతున్నాడు. రంగస్థలమంతా ఆక్రోధం కాల్చివేస్తుందేమోనన్నంత ఆగ్రహోదగ్రుడై ఊగిపోతున్నాడు. వీళ్ళిద్దరినీ నగరం నుంచి వెళ్ళగొట్టండి కారారపులరచాడు. మళ్లీ నా కంట కనపడకూడదు. బలప్రయోగం చేసి ఊరి బయటకు తరమండి వీళ్ళను అని కేకలు వేశాడు. నందగోపుడి చేతులకు, కాళ్ళకు సంకెళ్ళు వేయండి. వ్రేపల్లె నుంచి వచ్చిన అతడి పరివారాన్ని అందరినీ శిరచ్ఛేదం చేయండి.
వాళ్ళ సంపదనంతా దోచుకోండి, కొల్లగొట్టండి అని రాజ్యకార్య నిర్వాహకులైన ఉద్యోగులను, వీరవరులైన భటులను ఆజ్ఞాపించాడు కంసుడు. నా రాజ్యంలో యాదవుడు అనేవాడెవడూ ఉండకూడదు. కనపడకూడదు. సకల యాదవ క్షయం చూస్తాను. అని బొబ్బలు పెట్టాడు. ‘వసుదేవుడు ముసలివాడు కాబట్టి ప్రాణం తీయవద్దు. క్రూర దండనం విధించండి. తన ద్రోహం, తన పాపం తాను అనుభవించే క్రూర హింసకు పాల్పడజేయండి’ అని కేకలు పెట్టాడు. అపుడక్కడ ఉన్నవారంతా హాహాకారాలు చేశారు. చేతులతో ముఖాలు కప్పుకొని ఆక్రదించారు.
దేవకీ దేవి మూర్ఛపోయింది. ఆ సంక్షోభం, అక్కడున్నవారి హాహకారాలు, తొట్రుపాటు, దీనవదనాలు, బాష్పపూరిత నయనాలు చూసి శ్రీకృష్ణుడు కోపం పట్టలేకపోయినాడు. తననావహించిన కోప దేవతలకు పశు బలి ఇవ్వటానికి ఉద్యుక్తుడైనాడో అన్నట్లు రివ్వున మల్ల రంగంలో కంసుడి సింహాసనం దగ్గరకు ఉరికాడు. ఎపుడు కంసుడి ముందుకు ఆయన చేరాడో కూడా, ఆ మెరుపు వేగం ఏమిటో కూడా తెలుసుకోవటానికి వీలులేని దిగ్భ్రమపాలైనారు అక్కడి జనం. కంసుడి గుండెలు కూడా పగిలిపోయినాయి. ఏమిటి? మల్లరంగంలో ఒక కృష్ణుడు ఉండగా దివి నుంచి ఇంకొక కృష్ణుడు ఇక్కడకు చేరాడా? అని ప్రాణ సంశయ భయగ్రస్తుడైనాడు కంసుడు. కంసుడు తప్పించుకోవటానికి చూడగా కృష్ణుడు మణిమయ స్థగితమైన కంసుడి కిరీటాన్ని తన్నడంతో అది నేల కూలి ఆ మణులూ మణి మాణిక్యాలూ భూమిమీద చెదరిపోయినాయి. వెంటనే కృష్ణుడు కంసుడి జుట్టు పట్టుకొని వంగదీసి శిరసుపై పిడికిటి పోట్లు పొడిచాడు. గుండెపై మోకాటి పోటు తాటించాడు. కంసుడు గుభిల్లున నేలకూలిపోయినాడు. వాడి అలంకారాలు అన్నీ ప్రిదిలిపోయినాయి. ముత్యాల హారాలు తెగిపోయినాయి. ఉత్తరీయం చెదిరి దూరాన పడి పోయింది. కంసుడి ముక్కు నుంచి, నోటి నుంచి, చెవుల నుంచి ధారాపాతంగా నెత్తురు ప్రవహించింది. గుడ్లు తేలవేశాడు. విగతజీవుడైనాడు. ఇంతలో కృష్ణుడికి కంసుడి సోదరుడు సునాముడు కన్పించాడు. సునాముణ్ణి కోపంతో కృష్ణుడు చూస్తుండగా బలరాముడప్పుడు కంస సింహాసన వేదికపైకి ఉరికాడు. సునాముణ్ణి చంపివేశాడు.
అపుడు ఆకాశం నుంచి కుసుమ వర్షం కురిసింది. దేవతల జయ జయ ధ్వానులు పిక్కటిల్లాయి. మునుల స్వస్తి వచనాలు, అప్సరసల ఆటలు, పాటలు దర్శనీయమైనాయి. అప్రతిభుడై ఆందోళన హృదయుడై ఉన్న వసుదేవుడి దగ్గరకు వచ్చి కృష్ణుడు తండ్రికి పాద నమస్కారం చేశాడు.
కృష్ణుణ్ణి గాఢంగా పరిష్వంగం చేసుకున్నాడు వసుదేవుడు. అటు తరువాత వృద్ధుడైన ఉగ్రసేన మహారాజు దగ్గరకు వెళ్లి ఆయనకు నమస్కరించాడు. అక్కడున్న యాదవకుల పెద్దలందరికీ నమస్కారాలు చేశాడు. వాళ్ళంతా కృష్ణుణ్ణి ఆశీర్వదించారు. అభినందించారు. అర్చించారు. హర్షపులకిత గాత్రులై జయ జయధ్వానాలు చేశారు. అప్పుడు పెద్దలందరి దగ్గర శెలవు తీసుకొని కృష్ణ బలరాములు వసుదేవ మందిరం చేరారు.
- ఇంకా ఉంది

అక్కిరాజు రమాపతిరావు