భక్తి కథలు

హరివంశం-109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విషయం తలచుకుంటే నా ఆపాదమస్తకం దహించి వేస్తున్నట్లున్నది. ఈ పరాభవానికి ప్రతీకారం మనం తీర్చుకోకపోతే శాశ్వతంగా ఈ అపకీర్తి మనకు మిగిలిపోతుంది. సృష్టి ఉన్నంతవరకు ఉండిపోతుంది. ఏ ప్రయత్నంతోనైనా ఉపాయంతోనైనా ఆ యాదవులను వధించటమే నాకు కావలసింది. అప్పటిదాకా నాకు మనస్సమాధానం ఉండదు. కాబట్టి మీరు నాకు తోడుండాలి. ఈసారి మధురాపురిని సర్వనాశనం చేయాలి. బలరామకృష్ణులను మట్టుపెట్టాలి.
అపుడు గాని ఈ వైరం అణగదు. మన సైన్యాలు అనంతమైనవి. పృధివిలో ఎక్కడా ఎవరికీ ఇంత సైనిక బలం లేదు. యాదవులు చూడబోతే అల్పులు. వారి పక్షాన చేరేవారెవరూ లేరు. వారికి సాధన సంపత్తి ఏమీ లేదు. వారు అర్ధబలాన్ని, అంగబలాన్ని ఏ విధంగానూ చేకూర్చుకోలేరు. ఈసారి మనం పట్టుదలతో ప్రయత్నిస్తే వాళ్ళకు ఓటమి, మనకు విజయమూ తథ్యం. ఎటువంటి సందేహమూ వద్దు. వాళ్ళ వినాశనం తప్పదు అని జరాసంధుడు స్వపక్షంవారిని విశ్వసింపజేశాడు.
జరాసంధుడి బంధుగణం, స్నేహితులైన రాజులు, అతణ్ణి నెత్తిమీద పెట్టుకునేవారూ ఇందుకు ఆమోదించారు. ఇక తక్కిన రాజులు కూడా విష్ణువిరోధులు కాబట్టి అతణ్ణి చాలా ప్రోద్బలం చేశారు. అదీకాక గోమంత పర్వత యుద్ధంలో ఈ రాజులంతా ఇంతింతనరాని అవమానానికి గురి అయినవారే. చావు దప్పి కన్ను లొట్టపోయినంత పరాభవం వారనుభవించారు. అందువల్ల కృష్ణుడి పట్ల ఆ కంఠం వారికి పగ ఇంకా ఇంకా వృద్ధి చెందింది. ఈ రాజులలో ముఖ్యంగా చెప్పవలసినవారు పౌండ్ర, కళింగ, దంత వక్త్ర, శిశుపాల, సాల్వ, రుక్మి, యవన, వేణుధారి, సౌవీర, గాంధార, త్రిగర్త భూపతులున్నారు.
ఇంకా భగదత్తుడు కూడా వీళ్ళను పురికొల్పాడు. వీరందరికీ తోడు అంగ, వంగ, సుహ్మ, విదేహ, కాశ, కరూశ, దశార్ణ, మద్ర, పాండ్య భూవరులు జరాసంధుడి క్రోధాన్ని మరింత ఎగసనద్రోశారు. అపార బలాలను చేకూర్చుకొని జరాసంధుణ్ణి అనుగమించారు. ఈ విధంగా ఇరవై ఒక్క (21) అక్షౌహిణుల సైన్యం చేకూర్చుకొని ఈసారి మధురపై దండెత్తాడు జరాసంధుడు. కృష్ణుణ్ణి తమ అండగా చేసుకొని యాదవులు కోట అగ్ర ప్రదేశం నుంచి ఈ సేనావాహినిని చూశారు. విలయకాల సముద్రమా! అనిపించింది వారికి ఈ మహాసేన.
అప్పుడు శౌరి, హలాయుధుణ్ణి చూసి నవ్వుతూ భూభారం మాన్చటానికి ఈ సేననంతా తీసుకొని వచ్చి జరాసంధుడు మనకు తోడ్పడుతున్నాడు అన్నాడు. ఇది విధి సంకల్పంలాగా కనపడుతున్నది. జరాసంధుడి కారణంగా నిష్కారణంగా వారు చావబోతున్నారు. చూడు చూడు ఈ రథాలేమిటి? కేతనాలేమిటి? అశ్వ గజ నిపహాలేమిటి? సుభట కోటి ఏమిటి? వీరంతా ఈ రణభూమికి బలి అవుతారు కదా! మనం మన సైన్యలతో వీళ్ళను ఎదిరించాల్సి ఉంది. అన్నా! ఇందుకు సర్వసన్నద్ధంగా ఉండవలసింది’ అని చెప్పాడు.
యమునాతీరమంతా ఎక్కడ చూసినా జరాసంధుడి సేన అంతులేకుండా వ్యాపించి ఉంది. అపుడు జరాసంధుడు తనకు సహాయులుగా వచ్చిన రాజులందరినీ సమావేశపరచి వారితో మంతనాలాడాడు. గాలి కూడా చొరటానికి అవకాశం లేకుండా కోటను మనం ముట్టడించాలి. ఆ తరువాత కోటనంతా తవ్విపారేయాలి. ప్రాకారాలు కూల్చాలి. అగడ్తలు పూడ్చాలి. ఒడిసెల వాళ్ళు నిర్విరామంగా కోటపైకి గుండ్లు రువ్వాలి. బురుజులు శిథిలం చేయాలి. పారలు, పలుగులు, గునపాలు, ఉక్కు ఉలులు దేనితో పనిచేయగలవారు వాటితో రాతి గనులను కూడా రాపాడాలి. బీటలు వారేట్లు చేయాలి.

ఇంకాఉంది