భక్తి కథలు

హరివంశం 129

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇడుగో ఇడుగో కృష్ణుడు అన ఆమెతో ఉన్న సఖీజనం సంభ్రమ పరవశలై ఆమె చెవిలో ఊదారు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆమె కళ్ళు చెమర్చాయి. ఆమెకు తొట్రుపాటు కలిగింది. నిబ్బరించుకోలేకపోయింది. అఖిల సౌందర్య నిధియైన కృష్ణ సాక్షాత్కారంతో రుక్మిణి యోగ సమాధి స్థితి కలిగిన సాధకుడిలా తన ఉనికినే ఉజ్జగించింది. చుట్టు ఉన్న సఖీజనం నివ్వెరపోయినారు. ఈ దేవకి పట్టి, ఈ బలానుజుడు సకల లోక శుభప్రదాత, ఆర్యధర్మప్రవర్తకుడు, నా ప్రభువు, ఈయనకు నేను దాస్యం చేస్తాను అని ఆమె మనసు సందడించింది.
బలరాముడికి ముందే తాను చేయదలచుకొన్న పని సంకేతించాడు కాబట్టి అప్పటికే అక్కడకు చేరుకున్న అన్నకు సైగ చేశాడు కృష్ణుడు. సఖుల మధ్య ఉన్న రుక్మిణిని సమీపించాడు. ఆమెను పొదువుకున్నాడు. తీసుకొని వచ్చి రథంమీద కూచోబెట్టాడు. ఆమె చెలికత్తెలంతా తొట్రుపాటు ననుభవించారప్పుడు. ఆమె వెంట వచ్చిన సైనిక దళం హాహాకారాలు చేశారు. అంగరక్షకదళం కృష్ణుడి రథం వెంట పరుగులు తీశారు. బలరాముడు వారిని ఎదుర్కొన్నాడు. యాదవ వీరులంతా అక్కడకు చేరుకున్నారు. నగరమంతా అట్టుడికిపోయింది. గొప్ప కోలాహలం బయలుదేరింది.
జరాసంధుడు, రుక్మి, పౌండ్రకుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు ఆగ్రహంతో, అవమానంతో దహించుకొనిపోయినారు. పెండ్లి పనులలో నిమగ్నమైన భీష్మక మహారాజుకు కూడా అంగరక్షకులు కొందరు వెళ్లి ఈ సంగతి, తరువాత జరుగుతున్న కయ్యమూ భయభీతులై ఎరిగించారు. జరాసంధుడితో వచ్చిన రాజులందరూ కూడా ఎంత తెగువ, ఎంత సాహసం, మనందరకూ ఎంత అవమానం అంటూ ఆగ్రహోదగ్రులైనారు.
మగధేశ్వరుడు రౌద్రాకారుడైనాడు. కళ్ళనుంచి నిప్పులు వెలిగక్కాడు. పెదవి కరచాడు. వ్రేపల్లె గోపాలకుడు ఎంత పనిచేశాడు! నాకు ఎంత భంగపాటు కలిగించాడు! ఎగ్గు తలపెట్టాడు, ద్రోహం చేశాడు అని పళ్ళు పట పటలాడించాడు. నా ప్రయత్నమంతా వ్యర్థం చేశాడే. నలుగురిలో నా పరువు తీశాడే అని క్రోధోద్రిక్తమానసుడైనాడు.
ఇప్పుడే నా చతురంగ బలాలతో పోయి యాదవుణ్ణి వధించి, పెళ్లికూతురిని తీసకుని వస్తానని సన్నద్ధుడైనాడు. మీరు కూడా నాతో రావాలనుకుంటే రావచ్చునని గ్రక్కున బయలుదేరాడు. ఒకవేళ ద్వారకలో పోయి దాక్కున్నా వదిలిపెట్టను అని భీకర ప్రతిజ్ఞ చేశాడు.
అపుడు పౌండ్రకుడు (వాసుదేవ నామాంకితుడు) జరాసంధుడికి అడ్డం వచ్చి ప్రభూ! నేను మీ కింకరుణ్ణిడుండగా మీకెందుకీ ఆయాసం. ప్రయాసం. ముక్కలు ముక్కలుగా నరకి వస్తాను యాదవులను. భీష్మక రాజ తనయను మళ్లీ తెచ్చి మీకప్పగిస్తాను అని వీరావేశ ప్రగల్భాలు పలికాడు. లోకంలో ఈ వాసుదేవుడుండగా ఆ వాసుదేవుడెట్లు బతికి ఉంటాడు అని బీరాలు పలికాడు.
అప్పుడు శిశుపాలుడు ఒక పెద్ద గద పట్టుకొని నేయి పోసిన అగ్నిజ్వాలలాగా మండిపడుతూ నాకు సంభవించిన కష్టం, నష్టం, ఆశాభంగం, పరాభవం నేను తీర్చుకుంటాను. ఈ మచ్చ నాకు కదా వచ్చింది. దీనికి పరిహారం నేను కదా రాబట్టవలసింది. ఇందుగో నేనే వెళ్లి వాణ్ణి నిలవేసి గదతో వాడి గుండె పగిల్చి ఆ పిల్లను తీసుకువచ్చి జరాసంధుడితో శహభాష్ అనిపించుకుంటాను. మెప్పు పొందుతాను. ఈయన నన్ను చేరదీసినందుకు నా వీర విక్రమం కనపరుస్తాను. క్షత్రియుడైనవాడెవడైనా ఇతరుడికి నిర్ణీతమైన వధువునపహరిస్తాడా! ఇతరుడి భార్యను తీసుకొని పోతాడా? వాడా యాదవుడు క్షత్రియుడు కాడు.

ఇంకా ఉంది