భక్తి కథలు

హరివంశం 165

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు ఇప్పటిదాకా పిశాచివి కాబట్టి శవ మాంసం నీకు ఏవగింపు కలిగించటం లేదు, నీవు నన్ను హృదయ నిష్ఠుణ్ణి చేసి ధ్యానించావు కాబట్టి, ఇంకా నీకు ఈ జన్మ ఎందుకు? అని దివ్య హస్తంతో అతణ్ణి స్పృశించాడు కృష్ణుడు. పరుసవేది తాకితే ఇనుము శుద్ధ సువర్ణమయ్యే రీతి, ఆ పిశాచ రూపం ఘంటాకర్ణుడికి తొలగిపోయింది. దివ్య శరీరం సంప్రాప్తించింది.
సిద్ధచారణ గంధర్వులు, ఆదిమునులు, యోగులు, ఘనతపస్సులు కూడా సాధించలేని దానిని ఈ పిశాచి పొందాడు. అణిమాద్యష్టసిద్ధులు కూడా ప్రభుపాదారవింద లగ్నమానసుడైన సాధకుడికి లభించటంలో వింత ఏముంది? సిద్ధ పురుషుడైపోయినాడు ఘంటాకర్ణుడు.
అతడిప్పుడు ఇంద్ర సదృశుడైనాడు. ఇప్పుడీ కల్పంలో ఇంద్ర పదవి ఎంతకాలం కొనసాగుతుందో, అంతకాలం నీవు ఇంద్ర సఖుడవై తత్యులమైన భోగ భాగ్యాలన్నీ అనుభవిస్తావని శేషశాయి అతడికి వరమిచ్చాడు. ఈ కరుణకు కరగిపోయి ఘంటాకర్ణుడు, కృష్ణుడికి సాష్టాంగ ప్రణతుడై ‘అవన్నీ సరే! కాని నీ పద పద్మ సమర్చనంలో నాకు నితాంతమైన, నిశ్చలమైన భక్తిని నాకనుగ్రహించు’ అని వేడుకొని పునః పునః సర్వాలింగిత ధరాతలుడై ఆయనకు మొక్కి తనసిద్ధలోకానికి వెళ్లిపోయినాడు ఘంటాకర్ణుడు. ఇక వాసుదేవుడు కైలాస పర్వతానికి ప్రయాణమైనాడు.
బదరికావనంలోని నిఖిల మునిగణాలు ఆయనకు వీడ్కోలు చెప్పాయి. వాళ్ళకు రాత్రి జరిగిన ఘంటార్ణుడి వృత్తాంతం వినిపించాడాయన. పుణ్య పరిపాకమంటే అతడిదే కదా అని వాళ్ళంత విస్మయ మనస్కులైనారు.
శ్రీకృష్ణుడు కైలాస పర్వంతం చేరి అక్కడి దివ్య సుందర మనోహరదరులు, చరులు, గిరులు, తరులు, సుర సేవిత పుణ్యభూములు చూసి ఆనందించాడు. శివా, శివానీ పాద చరణ పరిపూత మునిజన సంసేవిత తపోభూములలో సంచరించి అక్కడి పవిత్ర భూములను చూస్తూ అచ్చెరువందాడు. మానస సరోవరాన్ని చూసి మహదానందపడ్డాడు. కుబేరుడి అలకా పట్టణం చూసి ఆశ్చర్యలగ్న మనస్కుడైనాడు. రావణుడు పోతరించి ధరణీధరం కింద అణగి కాలు చేయి ఆడక కుయ్యో మొర్రో అని ఆక్రందించింది ఇక్కడే కదా! అని ఆ రావణ పరాభవ వృత్తాంతాన్ని తలపోశాడు.
ప్రమథగణాలు మహా సంరంభంతో నృత్య ఖేలనాలతో విహరించేది ఇక్కడే కదా అని తలచుకొన్నాడు. గణపతి, స్కందుడు, భృంగిరిటి, శంఖుకర్ణుడు విహరించే ప్రాంతం ఇదే కదా అని మురిసిపోయినాడు. అచలకన్య తపస్సు చేసింది ఇక్కడే కదా అని ప్రమోదమానసుడైనాడు. ఈ గంగ, ఈ మానస సరోవరం, ఎంత దేవలోక ప్రసిద్ధాలు అని మెచ్చుకున్నాడు.
అంబిక కోసం విజయ మొదలైన ఆమె చెలికత్తెలు పువ్వులు కోసేది ఇక్కడే కదా అని హర్షోత్కర్ష చెందాడు. ఆ అర్థనారీశ్వరి విలాస భాసుర విహార ప్రదేశాలవి అని చోద్యమనభవించాడు. ఇట్లా ఆ ప్రాంతాలు విలోకిస్తూ ఆనందిస్తూ గంగానది ఉత్తర తీరానికి చేరుకున్నాడు కృష్ణుడు. అక్కడి మునులు, సిద్ధులు వచ్చి ఆయననెంతో గౌరవించారు. అక్కడనుంచి మానస సరోవర తీరం చేరి అక్కడ తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు.
నియమ నిష్ఠలతో పనె్నండేళ్ళు తపస్సు చేయాలని ఆయన సంకల్పించాడు. జఠాధారి అయినాడు. కందమూలాలు, పలాలు ఆహారంగా నియమించుకున్నాడు. తన్మయత్వంతో తపస్సుకు పూనుకున్నాడు. ఫాల్గుణ శుక్లపక్షంలో ఆయన ఇట్లా రక్ష స్వీకరించాడు. నిత్య స్నానాధ్యయన జప హోమ తర్పణ బల ప్రముఖంగా అనుష్ఠానం నిర్వహించుకుంటూ వచ్చాడు. గరుత్మంతుడాయననకు హోమ సమిధలు తెచ్చి ఇస్తుండేవాడు.

ఇంకా ఉంది