భక్తి కథలు

హరివంశం 167

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధులు, విదోధరులు తమ తమ సుందరీమణులను కూడుకొని అక్కడు వచ్చి ప ఆటలు పాడారు. నృత్యాలు చేశారు. చారణులు రుద్ర పరాక్రమ గాథలు పటించారు. ఇట్లా మహావిభూతితో విశేశ్వరుడక్కడకు వచ్చాడు.
కృష్ణుడప్పుడు జింక చర్మంపై కూచుని, జటాధారియై, హోమాగ్ని ముందు బాహ్యాన్ని మరచి తపస్సు చేసుకుంటున్నాడు. సాంబశివుడికి అట్ల గాఢ తపస్సిద్ధుడైన కృష్ణుణ్ణి చూసేప్పటికి కరుణార్ద్ర అంతఃకరణుడై అమ్మవారితో కూడా తన వాహనం మీదినుంచి దిగాడు. ఇట్లా పార్వతీ పరమేశ్వరులు వచ్చి తనకు ప్రత్యక్షం కావటం శ్రీకృష్ణుడు గ్రహించి దిగ్గున లేచి ఫాలంపై తన కేలుదోయి కీలించి పరమశివుణ్ణి స్తుతించాడు.
అప్పుడక్కడ ఉన్న సకల దేవతా సమూహం, మునిముఖ్యులు, ఋషీశ్వరులు, దిక్పాలకులు హరినీ, హరుణ్ణీ విస్మయావలోకమానసులై ఏ ఒకరి మీదా స్థిరంగా చూపులు నిలవక, నిలపలేక, అనిమేష పర్యాయక్రమంగా చూపులు మరల్చుకుంటూ ఆనంద పారవశ్యాన అనుభవిస్తున్నారు.
అమ్మవారికి మొక్కులిడుతున్నరు. సర్వలోక స్తుత్యులైన వారి మాహత్మ్యాలను ఇట్లా అభివర్ణిస్తున్నారు. ఒకరినుంచి ఒకరు స్ఫూర్తి పొందుతున్నారు. వాళ్ళిద్దరినీ పరస్పర సమక్షంలో చూడటంతో వారి హృదయాలు ప్రఫుల్లమవుతున్నాయి. భక్తి పొంగారి పులకిత దేహులవుతున్నారు.
‘ఒకరు యజ్ఞరక్షకుడు. ఒకరు యజ్ఞవిధ్వంసి. కందర్పజనకుడొకరు. కందర్ప దర్ప హరుడొకడు. భువన భర్త (స్థితికారకుడు) ఒకడు. భువనహర్త (లయకారుడు) మరొకడు. కండ నెత్తినవాడొకడు. కొండమీదే నివసించేవాడింకొకడు. పాలకడలి ప్రభావమైన రత్న మాలాంకృతుడొకరు. అందులోనే పుటిటన గరళాన్ని కంఠంలో నిలుపుకున్న వాడింకొకడు. ఒకరేమో భుజగశయనుడు. మరొకరేమో భుజగ విభూషణుడు. ఈ ఇద్దరూ మమ్ములను కరుణించి రక్షించాలి. కాపాడాలి. మాకు వీళ్ళిద్దరున్నూ వరదులు. మా అంతఃకరణనిలయులు. మా కోర్కెలు సిద్ధింపచేసేవారు అని శివకేశవులను వారు స్తుతించారు.
ఇట్లా సకల దేవతలు వారిని స్తుతిస్తుండగా పుండరీక నయనుడు త్రినయనుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
శ్రీకంఠా, చంద్రచూడా, దయావిలాసలాలిత సుజనా, వేదవేద్యా, నీవు అష్టమూర్తివి. ఉద్ధతతాండవ కేళీ లీలా వినోదుడవు నీవు. నీ రూపాలు అతి సౌమ్యాలు, అతిఘోరాలు క్రతు ఫలదాతవు నీవే! అఖిల భూత నియామకుడవు నీవు, భద్రకారుడువు, భద్రచరిత్రుడవు, త్రిలోకపతివి నీవు మహేశా! నాపట్ల నీవు ప్రసన్నుడవు కావలసింది’ అని ప్రస్తుతించాడు నీలకంఠుణ్ణి నీలవర్ణుడు. ఈ విధంగా కృష్ణుడు తనను స్తుతించగా పరమేశ్వరుడు ఆయన చేతిని తన చేతిలోకి తీసుకొని సకల దేవతలు, సమస్త ముని, తాపసులు వింటుండగా ప్రీతితో కృష్ణుడినిట్లా ప్రశంసించాడు.
‘నీవు దేవవంద్యుడివి జనార్దనా! నీవు పూర్వం నన్ను గూర్చి తపస్సు చేశావు. ప్రద్యుమ్నుడి కుమారుడిగా పొందావు. ఇప్పుడున్నూ నీ కోర్కె సిద్ధిస్తుంది. కుసుమాయుధుడు నా తపస్సు భగ్నం చేయటానికి సాహసించాడు. అందువల్ల దగ్ధుడైనాడు. ఆ మన్మథుణ్ణే నీకు కొడుకుగా పుట్టమని అనుగ్రహించాను. మన్మథుడు లేకపోతే సర్వలోకాలకు గతి ఏమిటి? అని దేవతలంతా ప్రార్థించగా నాకు కరుణ కలిగింది. ఇప్పుడీ ప్రస్తావన ఎంకంటే ప్రద్యుమ్నుడు నీకు అన్ని విధాలా నీ స్వస్వరూపుడు. ఇపుడు కూడా నీ మనోరథం సిద్ధిస్తుంది.
సాంఖ్యులు నినే్న ప రమగతివని ఆశ్రయిస్తారు. జగజ్జనన సుస్థితి విలయాలు నీ అధీనాలు. పుషసూక్తం నీ అక్షర స్వూపం.

ఇంకా ఉంది