భక్తి కథలు

హరివంశం 169

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసుల కాపరికి ఏవేవో లేని పోని మహిమలు ప్రచారం చేసుకుంటున్నారు యాదవులు. ఆ కృష్ణుడికైనా సిగ్గుండవద్దా, ఇప్పటివరకు తాను పశుల రేణాల (పేడలు) వెంట పరిగెత్తినవాడననే ఇంగితం ఉండవద్దా? తనకేమో ఒక చక్రమున్నదట. దానిని చూసుకొని పొంగి బోరగిలబడుతున్నాడు. తానేమో అవక్ర పరాక్రమ శౌర్యవంతుడనని అనుకొంటున్నాడు. తన చక్రం, తన శంఖం, తన శారం, తన గద, తన ఖడ్గం నాకు తృణప్రాయాలు.
నామీద యుద్ధానికి వచ్చాడా పరాభవంపాలు గాకతప్పదు కృష్ణుడికి. అదీకాక ఇలలో ఇద్దరు వాసుదేవులెట్లా ఉంటారు? అది నాకు పరువా? ప్రతిష్ఠా? నేను వాసుదేవుణ్ణి ఉండగా పశుపాలకుడు కూడా వాసుదేవుడు కాగలడా? వాడి పొగరు అణచివేస్తాను. నా దగ్గర కూడా కృష్ణుడి దగ్గర ఉన్నదానికంటే భీకరమైన సుదర్శన చక్రం ఉంది. దానితో అతడి ఆయుధాలన్నీ నుగ్గు నూచం చేస్తాను. నా దగ్గరా పాంచజన్యం ఉంది. దీనిని పూరించానా! ఆ కృష్ణుడి పాంచజన్యం మూగపోతుంది. కృష్ణుడి నందకం నా నందకం ముందు దిగదుడుపే. నేను దీనిని తీసుకొని ఆ కృష్ణుడి ఎదుట పడ్డానా? అంటే బీద అరపులు అరవకుండా ఉంటాడా? ఆ గోపాలుడు.
నా గద యముడి చేతి గదకన్నా భయంకరమైనది. కృష్ణుడి గద నాదానిముందు తుత్తుమురైపోతుంది. నా విల్లు సంధించానా ఆతడి విల్లు ముక్కలు కావలసిందే! భాస్వరమైన పంచాయుధాలున్న వాసుదేవుణ్ణి నేను కాక నందగోపుడి తనయుడు వాసుదేవుడా? అని ఉద్ధతుడై తక్కిన రాజులందరికీ తన ప్రతాపం తెలియచేస్తూ, శ్రీకృష్ణుడి పక్షం వహించి చెడిపోవద్దు! అని ఎప్పటికప్పుడు దూతల ద్వారా హెచ్చరికలు పంపుతూ వచ్చాడు పౌండ్రుడు.
ఇదివరలో శ్రీకృష్ణుడివల్ల పరాభవం పొందిన రాజులందరూ పౌండ్రుడి ప్రగల్భాలు చూసి హర్షించారు. కృష్ణుడిపట్ల మరింత క్రోధోద్రిక్తులైనారు. నీకు ప్రియం చేకూర్చటమే మాబాధ్యత, మా కర్తవ్యం. మా సంతోషం అని పౌండ్రక వాసుదేణ్ణి రెచ్చగొడుతూ ఉండేవారు ధరాధిపతులు కొందరు పౌండ్రకుణ్ణి ఎప్పటికప్పుడు.
ఇట్లా పౌండ్రుడు ద్వారకపై దండెత్తటానికి సకల సన్నాహాలు చేస్తుండగా ఒక రోజున నారద మహర్షి పౌండ్రుడి కొలువులో ఊడిపడ్డాడు. పౌండ్రికి చాలా సంతోషం కలిగింది. అర్ఘ్యపాద్యాలతో ఆయనకు ఎదురువెళ్లి భక్తిప్రపత్తులు చూపాడు నారదుడిపట్ల. నారదుడు కూడా ఈ అహంకారి క్షేమ సమాచారం కనుక్కున్నాడు.
‘నీవు ఈ లోకం, ఆ లోకం అనకుండా నాకం నంచి రసాతలం దాకా అన్ని లోకాలలో సంచరిస్తుంటావు. ఎక్కడ ఏం జరుగుతున్నా నీకు తెలుస్తుంది. కాబట్టి ఓ మునివర్యా! నిన్ను ఆశ్రయిస్తే నా కోరిక ఒకటి వెంటనే సఫలమవుతుంది. ఆ నా కోరిక ఏమంటే, నీవు ఏ లోకానికి వెళ్లినా నన్ను గూర్చీ, నా పంచాయుధాలను గూర్చీ, ప్రశంసించాలి. అంతేకాక కృష్ణుణ్ణి నేను ఇదుగో అదుగో జయించబోతున్నాననీ, ఆ కృష్ణుడి ఆయుధాల తుప్పు వదిలించబోతున్నాననీ అందరికీ చాటి చెప్పాలి.
ఆ కృష్ణుడు నికృష్ణుడు. ఇదివరలో ఎందరెందరి రాజులనో భంగపరిచాడు. అప్పుడా యుద్ధాలలో నేను లేను కాబట్టి అతడి ఔద్ధత్వం చెల్లింది. ఇక ఇప్పుడు ఆత్రుళ్ళు, ఆ గర్వం సమాప్తం చేస్తాను. ద్వారకా నగరాన్ని నా ప్రతాపంతో కాల్చివేస్తాను. ఈ విషయాలన్నీ నీవు దిక్పాలకుల సభలలో అన్నిటా చెప్పాలి. ఈ సహాయం మాత్రం చేసిపెట్టు, ఇదుగో నీకు పాద నమస్కారం చేస్తున్నాను. మహాత్మా! నా యుద్ధ ప్రతాపం, యాదవుల దైన్యం చూసి ఆకాశంలో నీతాలవృంతం విసురుకుంటూ నాట్యం చేసి ఆనందిద్దువుగాని’ అని ప్రలాపాలు పలికాడు పౌండ్రుడు నారద మహర్షితో.

ఇంకా ఉంది