భక్తి కథలు

హరివంశం 176

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంసుడి మంత్రులలో ఒకడైన పృథుడనే రాక్షసుణ్ణి, అతడి కొడుకైన అసిరోముడితోసహా వధించాడు. నరరూప ధరుడైన విరూపాక్షుడైన రాక్షసుణ్ణి, వాడి మదపుటేనుగైన ఐరావణంతో సహా రూపుమాపాడు. హిమశైల వాసులై లోకోపకారానికి తలపెట్టిన మైంద, ద్వివిదులనే వానరులను శిక్షించాడు.
శోణపురంలో పరమ శివానుగ్రహ సంరక్షితుడైన బాణుణ్ణి శిక్షించి ప్రాణమాత్రావశిష్ఠుణ్ణి చేశాడు. అతడి వేయి బాహువులు ఖండించాడు. అగ్ని తేజస్సును అణచివేశాడు. వరుణడిని ధిక్కరించి కలచివేశాడు. ఇక బాల్యంలోనే ఆయన మహిమలు పూతన సంహారం, కంస విదారణం తెలిసినవే కదా!
జరాసంధుడిని ఎన్నిసార్లు పరాభవించాడో, కాలయవనుణ్ణి ఎట్లు సంహరింపచేశాడో, రుక్మిని ఎట్లా భంగపుచ్చాడో నీకా కథలన్నీ వినిపించాను కదా! ఇంకా దేవకీ నందనుడు తన మేనత్త కుంతీ తనయులను ఏ విధంగా కాపాడి రక్షించి వారిచేత మహత్కార్యాలు చేయించాడో అర్జునుడి చేత ఖండవ దహనం చేయించటం, భీమసేసనుడి చేత జరాసంధుడిని పరిమార్చటం, నూరు తప్పులు సహించి శిశుపాలుణ్ణి సంహరించటం, భారతయుద్ధంలో భూభారాన్ని తొలగించటం శ్రీకృష్ణ దివ్యావతార గాథలు.
ధర్మవిద్వేషులను, ధర్మనాశకులను నిశే్శషంగా సంహరించటమే ఆయన అవతార పరమార్థం.
ఇక శ్రీకృష్ణు చరిత్రలో మరొక అద్భుతాద్భుతమైన కథ వుంది. అది ఏమంటే శివకేశవుల స్పర్థ. భక్తజనంసంత్రాణం. ఉషానిరుద్ధుల ప్రణయగాథ.
బలిదనుజుడి కుమారుడు బాణుడు గొప్ప శివభక్తుడు. బాణుడెంతటి శివభక్తుడంటే సాక్షాత్తు పరమశివుడే శత్రులెవరూ నీ పురంలో ప్రవేశించలేరు. నేను నీకు కావలి ఉంటాను అని బాణుడికి వరమిచ్చాడు. ఆ తువాత బాణుడు రుద్రగణాలతో చేరిపోయినాడు. ఆ కథ ఇది. బాణుడు సహస్ర బాహుశక్తికలితుడని ప్రసిద్ధి. ఇతడు కౌమార దశలో ఉన్నప్పుడు కైలాసగిరి సమీపంలోని కుబేరుడి అలకానగరం పుర పరిసర ఒక సుందర శైల కందరంలో పరమశివుడు, పార్వతీదేవి కుమారస్వామిని ముద్దుచేయటం, లాలించి తమ కుమారుడిపై ప్రేమ జల్లు కురిపించటం చూశాడు.
కుమారస్వామి పరమ దివ్య సౌందర్య తేజ సమ్మోహన రూపానికీ తల్లిదండ్రులాయనను గారాబం చేసే దృశ్యానికీ పరవశత్వం అనుభవించాడు. ఎంతటి మహద్భాగ్యం. ఎంతటి తపస్సు చేశాడో కదా ఈ దేవసేనాపతి. నేను కూడా జగత్పితరులైన ఈ తల్లిదండ్రులు నా పట్ల వాత్సల్యం, పుత్రత్వం చూపే తపస్సు చేస్తాను అని నిశ్చయించుకున్నాడు.
ఇట్లా ఏకాగ్రమైన భక్తియోగంతో బాణుడు చిరకాలం తపస్సు చేశాడు. ఆశ్రీత సులభుడైన శ్రీకంఠుడప్పుడు బాణుడికి సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు.
బాణుడు సాష్టాంగ నమస్కారం చేసి దేవాదిదేవా! నేను సకల లోకమాతకు పుత్రుడినై నీ దయావలోకనానికి పాత్రుణ్ణి కావాలి. వెరపు లేకుండా ఇటువంటి కోరిక కోరుతున్నందుకు నన్ను మన్నించు. నీవు భక్తవత్సలుడివి కదా! అని పశుపతిని నుతించాడు.
అపుడు కపర్ది అమ్మవారిని చూసి ‘ఈ బాణుడు మన కుమారస్వామి వంటివాడు. నేను కార్తికేయుడి తర్వాత కొడుకు. నా పాద భక్తుడు. స్కందుణ్ణి ఎట్లా నీవు చూసుకుంటున్నావో ఈ బాణుణ్ణి కూడా అట్లానే చూడాలి! అని చెప్పాడు. ఆ దయాకలితేక్షణ సస్మేర సుందరీ వదనారవిందయై ‘సరే’నన్నది.
శూలపాణి అప్పుడు కుమారస్వామి నగరమైన అరుణపురి సమీపంలోనే శోణపురిని ఏర్పాటుచేసి ఇక్కడ నీవు ఆవాసం చెయ్యి. నీ నగరానికి నేను కావలి ఉంటాను.

ఇంకా ఉంది