భక్తి కథలు

హరివంశం 181

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను నీకు చూపిన చిత్రపటాలలో నీవు ఎవరినైనా గుర్తుపట్టగలిగితే ఆ పరమ సుందరుణ్ణి పట్టి బంధించి అయినా నీ దగ్గరకు చేరుస్తాను. లేదా బతిమాలి బామాలి ప్రాధేయపడి అయినా తెచ్చి నీకు అప్పగిస్తాను. ఆ తరువాత నీవు నాకు కొత్త కథలు రోజూ చెప్పవలసి ఉంటుంది? ఇంతకూ ఆ భాగ్యవంతుడెవరో ఈ సౌభాగ్యవతిని రంజింపచేయటానికి అని చిత్రరేఖ చతుర వాగ్వైఖరిని ప్రదర్శించి ఉష సంతాపాన్ని పోగొట్టి ఊరడిల్లజేసింది. అప్పుడు ఉష జన్మ జన్మలకు నీకు ఋణపడి ఉంటాను అని ప్రియ వయస్యను అల్లుకొనిపోయింది. చిత్రరేఖ చేతిని తన తలమీదకు చేర్చి అదుముకొని ఎవరైనా తమ వాంఛితార్థం సమకూర్చుకోవటానికి ఎంతకైనా పూనుకుంటారు కానీ పరోపకారానికి ఎంత తెగింపుకైనా ఉద్యమించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉండగలరా? నీవు నా ప్రాణానికి ప్రాణం కాబట్టి నాకోసం ఇంతటి ఘనకార్య సిద్ధికి పూనుకుంటున్నావు అని భూషించింది చిత్రరేఖను. ‘జగదీశ్వరి నిన్ను కటాక్షించింది కాబట్టి, నా పూనిక సులభంగానే నెరవేరుతుంది’ అని చిత్రరేఖ కూడా స్నేహ ప్రసన్నురాలై ఉష పట్ల తన గారాబం చూపింది. ఒక వారంరోజులు మాత్రం నేను నీ దగ్గరకు రాను. నా పనిలో నిమగ్నురాలినై ఉంటాను’ అని చెలికత్తె దగ్గర శెలవు తీసుకుంది.
చిత్రరఖకు పూర్వజన్మ సంస్కారంవల్ల యోగవిద్య, అనేక కళలలో ప్రావీణ్యం చేకూరింది. ఆమె ధ్యాన తత్పరురాలై లోకా లోకాలలోని అనేక సుందరాకారుల రూపాలు ఒక పెద్ద చిత్ర పట ఫలకంపై రూపించి ఒక శుభ సమయంలో ఆ చిత్ర ఫలకాన్ని తెచ్చి ఉషకు చూపింది. అందులో తాను చిత్రలేఖనం చేసిన జగన్మోహన మూర్తులను గూర్చి పేరు పేరున వర్ణించింది. అపుడు ఉష ఆ చిత్రఫలకంలో ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుని చూసి చాక్కిపోయింది. ఆ మూర్తినుంచి తన చూపు మరల్చుకోలేకపోయింది. అపుడు చిత్రరేఖకు అర్థమైంది భవాని వరప్రసాదుడతడేనని. ఉష తనలో తను మురిసిపోతూనే మనసులో నిష్ఠూరమాడింది అనిరుద్ధణ్ణి. ‘ఆనాడు దొంగలా వచ్చావు. నన్ను దోచుకున్నావు. ఈనాడు మా చిత్రరేఖకు చిక్కావు. నాకు దక్కావు. నిన్ను నా బహుపంజరంలో బందీ చేస్తాను. ఏమి శిక్ష విధించాలనో తరువాత నిర్ణయించి తీర్పు చెపుతాను’ అనుకున్నది. ఈ తలపు ఆమెకు కలగగానే ఆమె వదనంలో హాస వికారం కలిగింది. అది చూసి చిత్రరేఖ అనిరుద్ధడే ఈమె ప్రియుడు అని నిర్ణయించుకున్నది. అనిరుద్ధుడు సాకారుడైన మన్మథుడి పుత్రుడు. ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడికి పరమ శివుడి వరప్రసాద లబ్ధుడు. ఈ జంట సౌభాగ్యం ఎంతని కొనియాడాలి? అని తను కూడా ఎంతో ముచ్చటపడింది చిత్రరేఖ. అయితే ఉన్న ప్రమాదమంతా ఇక్కడే ఉన్నది. అనిరుద్ధుడికి తన బిడ్డనిచ్చి పెళ్లి చేయటానికి బాణుడు సుతరామూ ఇష్టపడడు. అతడిని శోణపురంలో అడుగుపెట్టనివ్వడు. శ్రీకృష్ణుడి మనవడితో వివాహ సంబంధమంటే మండిపడతాడు కదా, శోణపురాధీశుడు. అనిరుద్ధుణ్ణి ఏ విధంగానైనా ఉష అంతఃపురం చేర్చినా తరువాత యాదవులతో గొప్ప కలహానికి దారితీయవచ్చు. శ్రీకృష్ణుడు తప్పక తన మనవడిని రక్షించటానికి శోణపురంమీద దండెత్తటం తథ్యం అని పరి పరివిధాల ముందు వెనుకలు ఆలోచించింది చిత్రరేఖ. అయినా తన ప్రాణసఖి ప్రాణాలు కాపాడడం తన కర్తవ్యం అని గట్టిగా నిశ్చయించుకుంది. ‘నీ మనోరథం తప్పక సిద్ధిస్తుంది. నీవు ధైర్యంగా ఉండు. నేను నీకు నీ ప్రియుణ్ణి జతకూరుస్తాను’ అని ఉషను తక్కిన చెలికెత్తెలను జాగ్రత్తగా చూస్తూ ఉండండని చెప్పి ఆకాశ గమన విద్య తనకు తెలుసు కాబట్టి వెంటనే అంతరిక్షంలోకి ఎగిరిపోయింది చిత్రరేఖ.

ఇంకా ఉంది