భక్తి కథలు

హరివంశం 193

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద పెట్టున ఆయనపై ఉరవడించింది. ఈ ఉగ్రజ్వర మూర్తికి మూడు శీర్షాలు, మూడు మూడు కన్నులతో మొత్తం తొమ్మిది కన్నులు, మూడు కాళ్ళు, ఆరు చేతులు గల మహోగ్రమైన జ్వరాధిదేవత ప్రళయాగ్నిలాగా ఆయనను సమీపించింది. మేఘగర్జన వంటి స్వరంతో వాళ్ళను తూలనాడింది. ఇదివరలో మీరు నన్ను గూర్చి విని ఉండరు, తెలుసుకొని ఉండరు, ఇపుడు నా ప్రతాపం ఏమిటో మీకు చూపిస్తాను అని మహాకోపాటోపంతో బలరాముడిపై ముష్టి ప్రహరణాలు (పిడికిటిపోటులు) ప్రయోగించటానికి సమీపిస్తుంగా గరుడుడు గగన మండలంలో గిర్రున తిరుగుతూ, ఆ పిడికిటిపోట్లు ఆయనకు తగలకుండా చూశాడు.
దీనితో జ్వరదేవతకు మరింత ఆగ్రహం ముంచుకొని వచ్చింది. అప్పుడు జ్వరాధిదేవత తన ప్రబలాయుధమైన భస్మాన్ని (విబూదిని) బలుడిపై చల్లింది. అది ఆయన వెడద వక్షస్సును తాకి అక్కడనుంచి బెదిరిపోయి భగ భగమండుతూ పోయి మేరు పర్వతం చరియపై పోయి పడి ఆరిపోయింది. ఆ మేరు చరియ వ్రయ్యలైపోయింది.
ఇట్లా ఈ జ్వరం తనను స్వల్పంగానైనా సోకినందువల్ల బలరాముడి శరీరమంతా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. ఒళ్ళు సల సల కాగిపోయింది. ఆపుకోలేని పెద్ద పెద్ద ఆవులింతలపాలైనాడు బలరాముడు. ఎడతెగని వేడి నిట్టూర్పులు ముక్కులనుంచి వెలువడుతున్నాయి. కండ్లు మూసుకొని పోయి ప్రయత్న పూర్వకంగా కూడా తెరవలేకపోయినాడు. ఆయన శరీరమంతా గజ గజ వణికిపోవటం మొదలైంది. శరీరం తన స్వాధీనం తప్పింది. స్పృహ కూడా కోల్పోతానేమోనని భయపడ్డాడు. మనోవైకల్యం కలిగింది. గద్గద కంఠుడైనాడు. తూలిపోతూ, సోలిపోతూ కృష్ణ కృష్ణ నన్ను వచ్చి చూడు, కాపాడు అని వేడుకున్నాడు. నా శరీరమంతా ఒకటే మంటలు అని కాతరుడైనాడు.
అన్నా! నేను నీ ప్రక్కనే ఉండగా నీకు భయమెందుకు, క్షణంలో నీ బాధలన్నీ ఉపశమింపజేస్తానని కృష్ణుడు బలరాముణ్ణి ప్రియమార కౌగిలించుకున్నాడు. అంతటితో బలరాముడు తేరుకున్నాడు. పూర్వంకన్నా ఆయనలో జవసత్త్వాలు, తేజస్సు, ఉత్సాహోల్లాస దీప్తులు ఇనుమడించాయి.
కృష్ణుడప్పుడా ఉగ్ర జ్వరాన్ని సంబోధించి ఏదీ నీ ప్రతాపం నాపై చూపు అని ఉగ్రంగా ఉగ్రజ్వరాన్ని వీక్షించాడు. అప్పుడు జ్వరాధిదేవత రెచ్చిపోయి జజ్వాలమైన భస్మాయుధాన్ని ఆయనపై విసిరింది. అది ఆయనను తాకగానే పెద్ద మంటలో చిన్న కీలలాగా అయిపోయి శ్రీకృష్ణదేవుడి దేహంతో దివ్యోజ్జ్వల ధగద్ధగాయమానమైన కాంతిలో కలిసిపోయింది. ఇక ఏమి చేయలేక మరింత రెచ్చిపోయిన జ్వరోగ్రదేవత ఆయనను సమీపించి ఆయనను వాటేసుకొని భుజాలపైన, వక్షస్థలంపైన పిడికిటి పోట్లు పొడిచింది. శ్రీకృష్ణుడికి మహాగ్రహం కలిగి దానిని కూడా పటుముష్టిహతురాలిగా సత్కరించాడు.
ఇట్లా వాళ్ళిద్దరూ ఒకరినొకరు పిడికిపోటులతో ప్రహరించుకున్నారు. కొండమీద పిడుగుపడినప్పటి మహారావం ఆ పిడికిటిగుద్దులు సృష్టించాయి. ఉగ్రజ్వరాన్ని గట్టిగా బాహువుల మధ్య బంధించి మర్దించి ఊపిరాడకుండా జేసి పో! నీ అసువులు బాసావు. అని కృష్ణుడు దానిని నేలమీద పడిపోయేట్లు తోసివేశాడు. కాని అది చావలేదు. పట్టుదలతో ఆయన శరీరంలోకి ప్రవేశించింది. శ్రీకృష్ణుడికి పూర్వం బలరాముడు పొందిన సంభ్రమం కలిగింది. కాని ఆయన పరమేశ్వరుడు కాబట్టి దానికి వెంటనే ప్రత్యుపాయం ఊహించి అనుజ్వరమనే ప్రతి సృద్ధి జ్వరాధిదేవతను సృష్టించాడు. శ్రీకృష్ణుడు సృష్టించిన ఈ ఉగ్రశక్తి ఆయనలో ప్రవేశించిన మొదటి ఉగ్ర శక్తిని ఈవలకు లాగి ఈడ్చి ఆయనకువప్పగించింది.

ఇంకా ఉంది