భక్తి కథలు

హరివంశం 204

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రుడు కూడా సకల దేవతా గణాలతో, అప్సరసలతో కృష్ణుడు ద్వారక చేరటానికి ముందే వచ్చి ద్వారకానగరాన్ని సకల సౌందర్య విరాజితంగా అమరావతికన్నా వైభవోపేతంగా అలంకరింపజేశాడు. భవుడూ, భవానీ, స్కందుడు కూడా ద్వారకా నగరం ఉపవనాలలో ఒకదానిలో విడిది చేశారు. సప్తర్షులు, సకల మునులు, దేవతలు, వసురుద్రాదిత్యులు అందరూ ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడి ఆగమన శోభన వైభవాన్ని దర్శించి ఆనందించటానికి కుతూహలులై వచ్చారు. యాదవ ప్రముఖులందరూ ఎప్పుడెప్పుడు తమ ప్రభువు వస్తున్నాడా? అని ఎదురుచూశారు.
ద్వారకాపుర బహిరంగణంలో శ్రీకృష్ణుడు గరుడుడిని దిగి ఉషానిరుద్ధులకు ఒక దివ్య రథం సమకూర్చాడు. సకల దేవతలు స్తుస్తుండగా ద్వారకాపురిలో ప్రవేశించి ఆయన ఉషానిరుద్ధులను తన రాణులకు అప్పగింతలు కార్యక్రమం చేపట్టాడు. రోహిణిదేవి, రేవతీదేవి, దేవకీదేవి, రుక్మిణీదేవి, సత్యభామాదేవి, ఇంకా యాదవ కుటుంబాల పుణ్యాంగనలు ఉషానిరుద్ధులను చూసి మురిసిపోయినారు. ఉషను అందరూ మేలమాడారు. కౌగిలించుకుని రాణివాసమంతా దీవించింది.
ఉషను అత్తలు, తోడికోడళ్ళు అందరూ ముద్దుచేశారు. ఉషానిరుద్ధులు తమ దివ్య హర్మ్యంలో అప్పుడు గృహ ప్రవేశ కార్యకలాపం నిర్వహించారు. చిత్రరేఖ ఆనందానికి హద్దులు లేవు. శ్రీకృష్ణుడు చిత్రరేఖ చెల్లెలు రామా అనే పేరుగల ముద్దుగుమ్మను ఉగ్రసేనుడి, ఆ కన్య తండ్రి అయిన కుంభాండకుడి అభ్యనుజ్ఞ పొంది తన కుమారుడైన సాంబుడికి వివాహం చేశాడు.
ఈ విధంగా కయ్యం వియ్యానికి నెయ్యానికి దారితీసింది. ఇంకా సుర సంఘపు సిద్ధ సాధ్య కిన్నర గంధర్వ కన్యలను తన తక్కిన కుమారులకు వధువులుగా స్వీకరించి ఈ శుభ సమయంలోనే పెండ్లిండ్లు జరిపించాడు శ్రీకృష్ణుడు. చిత్రరేఖ కొన్నాళ్ళు తన ప్రియ సఖురాలితో వినోదించి, ఆనందించి అప్సరోలోకానికి వెళ్లి చేరింది.
***
హరివంశ కథలను వైశంపాయన మహర్షివల్ల చెప్పించుకొని వింటున్న జనమేజయ మహారాజుకు తమ వంశ రక్షకుడైన, పృధివిపై తమ వంశం నిలిచి ఉండటానికి కారణమైన శ్రీకృష్ణుడి కథలను ఎన్ని విన్నా, ఎంత విన్నా, ఇంకా ఇంకా వినాలనే కుతూహలమూ, ఆసక్తి, ఉత్కంఠ పెరుగుతూనే వచ్చాయి.
శ్రీకృష్ణ జననానికి పూర్వం ఆయన వంశ కథలను చెప్పవలసిందిగా ఆయన వైశంపాయన మునిని కోరాడు. అసలు యాదవ వంశమని ఆయన వంశానికి పేరు రావటమని జనమే జయ మహారాజు తెలుసుకోగోరాడు.
అపుడు వైశంపాయన మహర్షి చంద్రవంశపు రాజుల పుట్టుపూర్వోత్తరాలు, యుగయుగాలలో వారు నిర్వహించిన దివ్యాద్భుత గాథలు, దేవ మనుష్య లోక సంబంధాలు జనమే జయుడికి చెప్పటం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడి వృష్ణి వంశం. ఈ వృష్ణి వంశం ధరలో విస్తరించటానికీ, వర్థిల్లటానికీ మూలమైనది చంద్రవంశం. ఆ చంద్ర వంశపు కథలు మొదట చెపుతాను విను అన్నాడు ముని.
బ్రహ్మదేవుడి మానస పుత్రుడు అత్రి మహాముని. ఆయన అఖిల లోకహితార్థం మనోవాక్కాయ కర్మలు ధర్మంలోనే నిలిపి మూడు వేల దివ్య వర్షాలు తపస్సు చేశాడు. అటువంటి తపస్సు ఏ లోకంలోనూ ఎవరూ ఎపుడూ చేయలేదు. ఆయన ఊర్థ్వ రేతస్కుడై మహాద్భుతమైన అసదృశమైన పరమ పరమమైన తపస్సు చేయగా చేయగా ఆయన కళ్ళనుంచి కాంతిమంతమైన కన్నీరు స్రవించటం ప్రారంభించింది. ఇట్లా స్రవించి స్రవించి ఆ కన్నీరు ఘనీభవించింది.

ఇంకా ఉంది