భక్తి కథలు

హరివంశం 213

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మీ వంశంలో ఋక్షకుడు, పరీక్షిత్తు, జనమేజయుడు అనేవాళ్ళు ఇద్దరిద్దరుగా ఉన్నారు. భీమసేసనుడి పేరుతో ముగ్గురున్నారు మీ వంశంలో అని ఈపాటికే నీకు తెలిసి ఉంటుంది అని జనమేజుడికి వైశంపాయనుడు చెప్పాడు. ఇపుడు చెప్పిన భీమసేనుడికి ప్రదీప మహారాజు జన్మించాడు.
ఆయన భవ్యయశుడు. ఈయన పుత్రులే దేవాపి, శంతనుడు, బాహ్లికులనే వారలు. దేవాపి పసివాడుగా ఉన్నపుడే తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. భృగువంశానికి చెందిన చ్యవనుడికి అభిమాన పత్రుడైనాడు. దేవతలకే ఆచార్యుడైనాడు. అందువల్ల శంతనుడు రాజైనాడు. ఈయనకు జాహ్నవివల్లా, వసు రాజు కూతురైన సత్యవతివల్లా భీష్ముడు, చిత్రాంగద, విచిత్రవీర్యులు జన్మించారు.
విచిత్రవీర్యుడికి దృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. పాండు రాజు పుత్రుడు అర్జునుడు మీ ముత్తాత. మీ తాత అభిమన్యుడు వంశకరుడు. ప్రదీపుడి మూడో కొడుకైన బాహ్లికుడికి సోమదత్తడు జన్మించాడు. భూరిశ్రవుడు శ్శల, శ్శల్యులుల సోమదత్తుడి కుమారులు.
ఈ విధంగా యయాతి మహారాజు కడగొట్టు సంతానమైన పూరుడి వంశం శాఖోపశాఖలుగా విస్తరించింది. పూరుడి అన్న అయిన తుర్వసుడి సంతానం కూడా బహు శాఖలుగా వృద్ధి పొందింది. తుర్వసుడి మునిమనుమడు కరంధముడు.
కరంధముడి కుమారుడు మరుత్తుడు. బృహస్పతి సోదరుడైన సంవర్తుడు మహాయజ్ఞం నిర్వహింపజేసిన మరుత్తుడు కాడీయన. ఇతడు ఇంకొకుడు. అదే పేరుగలవాడు. ఈయన అపుత్రకుడైనందువల్ల దుష్యంత మహారాజు తమ్ముడైన దిష్యంతుణ్ణి పెంపుడు కొడుకుగా గ్రహించాడు. ఈ విధంగా తుర్వసు వంశం, పూరు వంశంలో సమ్మిశ్రీతమైంది. ఈ దిష్యంతుడి మనుమడు ఆశ్రీతుడు.
ఈ ఆశ్రీతుడికి పాండ్య కేరళ కోళ చోళులనే నలుగురు కొడుకులు కలిగారు. వీళ్ళు ప్రత్యేకంగా తమ తమ పేర్లతో వంశకర్తలైనారు. వాళ్ళ వాళ్ళ పేర్లతో జన పదాలు ప్రతిష్ఠించారు. ఇక యయాతి మూడవ కుమారుడైన ద్రుహ్యుడి వంశం కూడా బాగా శాఖోపశాఖలైంది. ద్రుహ్యుడి మనవడు అంగారుడు ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడైన మాంధాతతో పధ్నాలుగు నెలలు ఘోర యుద్ధం చేశాడు. తరువాత ఇద్దరికీ సఖ్య కుదిరింది.
అంగారుడప్పుడు మరు భూములకు రాజైనాడు. ఈ అంగారుడికి గాంధారుడనే కుమారుడు కలిగాడు. ఇతడే తన పేర గాంధార దేశాన్ని ఏర్పాటుచేశాడు. ఈ వంశంలో పుట్టిన వారు అశ్వారోహణ విద్యలో ఎంతో ప్రవీణులైనారు. వీళ్ళు చాలా పరాక్రమ శాలురుగా పేరుగాంచారు.
ఇక యయాతి మూడో కొడుకైన అనువుకు చెందినవారందరూ కొడుకులు, మనుమలు, ఆ తరువాత తరాలవారు ధర్మపథీ నచ్యుతులై మ్లేచ్ఛదేశాలకు రాజులైనారు. వీళ్లు మ్లేచ్ఛులైనారు.
ఇక యయాతి మహారాజు పెద్ద కొడుకైన యదువు వంశం గురించి చెపుతాను అని వైశంపాయనుడు యదువంశం గూర్చి చెప్పసాగాడు. యదువుకు పదుగురు కొడుకులు. సహస్రదుడు పెద్దకుమారుడు.
ఈతడికి హైహయుడు పెద్దకొడుకు. ఈయనకు ఎనిమిది మంది కొడుకులు. అందరిలో చిన్నవాడు ధేనుకుడు. ఈయన నలుగురి కుమారులలో పెద్దవాడు కృతవీర్యుడు. ఈయనకు కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అత్రి మహాముని తనూజుడైన దత్తాత్రేయుణ్ణి పెక్కు వేల సంవత్సరాలు కార్తవీర్యుడు ఉపాసించాడు. యుద్ధాలలో ఆయనకు సహస్ర బాహుబలం కలిగేట్లు దత్తాత్రేయుడు అనుగ్రహించాడు.

ఇంకా ఉంది