భక్తి కథలు

హరివంశం - 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పని ఇంకొకరివల్ల ఎంత మాత్రం అయ్యేది కాదు. ఇట్లా ఒక గొప్ప మహా యుద్ధం జరిగి సర్వ క్షత్రియ నాశనం కావటమే కాక ఇంకొక మహత్కార్యం కూడా నీవల్ల జరగవలసి ఉంది పుడమిలో. దానిని నీకు తెలియజేటానికే ఇపుడు పరుగు పరుగున వచ్చాను. ఈ విషయం మీరు అవశ్యం ఆలోచించాలి.
కిందటి యుగంలో తారకామయం అనే ఘోర యుద్ధం దేవాసురుల మధ్య జరిగింది కదా! నీవు అసురులనందరినీ వధించి దేవతలను రక్షించావు ఆ భయంకర పోరులో. వాళ్ళు ఇపుడు భూలోకంలో పుట్టి యజ్ఞ విద్వేషులై దేవతల శత్రువులై లోకాన్ని బాధిస్తున్నారు. ఆ వివరాలు చెపుతాను విను.
శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి లోకోప్రదవం లేకుండా చేశాడు కదా. ఈ రావణాసురుడి మేనల్లుడు లవణుడనేవాడు రెచ్చిపోతున్నాడు. ఈ లవణాసురుడు మధువనే రాక్షసుడి కొడుకు. వీడు ఎంత దుర్మార్గుడో అంత పరాక్రమంతుడు. యమునా తీరంలో గొప్ప అరణ్యాలున్నాయి.
అందువల్ల అక్కడ ఆవాసముండి తపస్వులను నా నానా బాధలు పెడుతూ వచ్చాడు. వాళ్ళు ఈ ఘోర బాధలు భరించలేక వెళ్లి శ్రీరామచంద్రుణ్ణి ఆశ్రయించారు. ఆయన దేవతారాధ్యుడు, సకల లోకాధినాధుడు. తన తమ్ముడిని శత్రుఘు్నణ్ణి పంపించి తాపసులకు, ఋషులకు ఆ చెనటి రక్కసుడి బాధ లేకుండా చేయవలసిందని కోరాడు. శత్రుఘు్నడు వెళ్లి లవణాసురుణ్ణి పరిమార్చాడు. ఆ అడవులను రాక్షస నిరవశేషం చేయటమే కాక నిర్భయంగా ప్రజలు జీవించేట్లు చేశాడు.
శత్రుఘు్నడికి అక్షయ నిధులున్నాయి కాబట్టి అక్కడ ఒక గొప్ప విశాలమైన, సకల సంపత్సమృద్ధమైన ఒక మహానగరం నిర్మించాడు. ఆ ప్రాంతాన్ని మధువనం అంటారు కాబట్టి ఆయన నిర్మించిన నగరానికి మధుర అనేపేరు వచ్చింది. ఆ మధురానగరం సొగసు, వైభవం, సౌందర్యం, విస్తీర్ణం, ప్రజా సమృద్ధి ఇంతా అంతా కావు. ఎక్కడ చూసినా రమణీయ ఉద్యానవనాలు, తటాకాలు, ఎతె్తైన గోపురాలు, నిత్య నిరంతర భోగ భాగ్య విలాస సంతుష్టు జనాకీర్ణంగా విలసిల్లుతూ వచ్చింది. శత్రుఘు్నడి తనయులు తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. తరతరాలుగా ఆ నగరం మరింత శోభ వహిస్తూ వచ్చింది. ఐశ్వర్య సమృద్ధమూ అయింది.
కంసుడు ఇపుడా నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఇపుడు భోజవంశంవాడు ఈ నగరాన్ని తమదిగా చేసుకున్నారు. కిందటి దేవాసుర యుద్ధంలో నీ చక్రాయుధ హతుడైన కాలనేమి ఇప్పుడీ కంసుడిగా పుట్టాడు. వెనుకటి జన్మ రాక్షసత్వం, పగ, క్రోధం అతడు మరచిపోలేదు. ఇంకా మరింత రగులుతూనే ఉన్నాయి వాడిలో. తండ్రి ఉగ్రసేనుణ్ణి చెరలో బంధించి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈ కంసుడు. వాడి బంధువులంతా వాడంటే వణికిపోతున్నరు. ఏ రాజూ వాడి వైపు కనె్నత్తి చూడటానికే భయపడిపోతున్నారు. ప్రజలను పాలించవలసిన రాజు అయినందుకు ఒక్కగానొక్క మంచి గుణం కూడా కంసుడిలో లేదు. తేరి చూడరాని పరాక్రమవంతుడే. అయితేనేమి ఘోర రాక్షసుడి వాసనలేమీ అతణ్ణి విడిచిపెట్టలేదు.
లోకాలన్నీ హడలిపోతున్నాయి. కంసుణ్ణి తలచుకొని అతణ్ణి కొలిచి బలిసి ఉన్నవారంతా అంతకన్నా క్రూరులు. వాళ్ల ఔర్థత్యం ముందు ఎవరూ నిలవలేకపోతున్నారు. అతడి చెలిమికాండ్రందరూ కూడా రాక్షసులే. పరమ నీచంగా వాడి రాజ్యపాలన సాగుతున్నది.
కిందటి దేవాసుర యుద్ధంలో నీ చక్రనిహతికి మృతులైన ఆ రాక్షసులు మళ్లీ కంసుడికి సుహృత్ సేవా పరివారంగా మళ్లీ జన్మించారు.
-ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు