భక్తి కథలు

హరివంశం - 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయగ్రీవ రాక్షసుడు కేశి పేరుతో గుర్రం రూపుతో జన్మించాడు. బలిదనుజుడి పుత్రుడైన అరిష్టుడు ఆంబోతు రూపంలో జన్మించి విర్రవీగుతున్నాడు. ఖర రాక్షసుడు ధేనుకుడనే పేరుతో పుట్టాడు. వీడు గాడిద రూపంగా పుట్టాడు. లంబుడనే రాక్షసుడు ఈ జన్మలో ప్రలంబుడై జన్మించాడు. నిశుంభ రాక్షసుడు తననెవరూ గుర్తించకుండా కువలయాపీడమనే ఏనుగులా పుట్టి కంసుణ్ణి సేవించుకుంటున్నాడు. వరాహుడు, కిశోరుడు చాణూర, ముష్టికులనే మల్లులుగా పుట్టారు. వీళ్ళందరూ పూర్వభావంలో కాలనేమికి బాగా కావలసిన వారేనూ!
ఇపుడీ జన్మలో కంస రాక్షసుడి పరిచారకులై పుట్టారు. వీళ్ళు కాళింది నదీ తీరంలో, బృందావనంలోని భాండీరకమనే గొప్ప వట వృక్షం పరిసరాలలో, పెను తాటి చెట్ల అడవిలో, ఇంకా కొందరు మధురానగరంలోనూ ఇపుడున్నారు. ఇక మయ రాక్షసుడు, తారుడనే దనుజుడూ, మురాసుడి కొడుకులై పుట్టి ప్రాగ్జ్యోతిషపురంలో నరకాసురుడి నెచ్చెలులై ఆ రాక్షసుడి కొలువు చేస్తున్నారు. వీళ్ళందరికీ నీ పేరు వింటే చాలు పరమ విద్వేషం. ఎవరైనా నిన్ను స్తుతిస్తే అసూయాగ్నితో దహించుకొనిపోతారు. వీళ్ళు జన్మదారభ్య నీవాళ్ళంటే మండిపడతారు. నీ భక్తులను విరుచుక తిందామని వాళ్ళ ఆటోపం, ఆరాటం.
కాబట్టి దేవదేవా! నీవు మళ్లీ అవతారమెత్తవలసిన సమయం వచ్చింది. భూలోకంలో పుట్టి నీవాళ్ళను రక్షించుకో! నీ దివ్య సౌందర్య విభవాన్ని భూమి మీద కొంతకాలం ప్రకటించుకో!
అంతేకాక భూభారాన్ని తొలగించవలసిన కర్తవ్యం కూడా నీకు ఉండనే ఉంది. ఈ పనిలో నీకు సహాయకులుగా ఎందరో దివిజులు జన్మిస్తున్నారు కదా! వాళ్ళను కాపాడవలసిన భారం, దైత్యులను రాపాడవలసిన బాధ్యత నీవు తప్ప ఇక ఎవరు నెరవేర్చగలరు? అని నారద మహర్షి కమలనాభుడికి విన్నవించుకున్నాడు. ఇట్లా నారదుడు చెప్పగానే శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఈ విషయాలన్నీ నాకు తెలియకపోలేదు. రాక్షసులు మళ్లీ జన్మించి ఎట్లా విజృంభించాలని పొంచి ఉన్నారో కూడా నాకు తెలుసు. ఇపుడు నీవు చెప్పిన వాళ్ళే కాదు, ఇంకా పరమ క్రూరులు, దుర్మార్గులు కాలయవనుడు, జరాసంధుడు, శిశుపాలుడు.
కౌశికుడు, చిత్రసేనుడు కూడా ఉన్నారు. వీళ్ళు భూమండలాన్ని గగ్గోలు పరుస్తున్నారు. వీళ్ళను కూడా పరిమార్చవలసి ఉంది. దీనితోపాటు భరత వంశంలో అన్నదమ్ముల మధ్య మహా ఘోర యుద్ధం ఒకటి జరగబోతున్నది. ఇట్లా రెండు పక్షాలవారి చేత యుద్ధం చేయించి భూభారం కూడా తగ్గించాల్సిన తరుణం ఆసన్నమైందని కూడా నేను నిశ్చయించాను.
ఇదంతా నాకు అవగతమే. అయితే నేను జన్మించటానికి తగిన వంశం, తగిన చోటు కూడా ఆలోచించాలి కదా! అది నిర్ణయించిన తరువాత ఆ పనికి పూనుకుంటాను’ అని శ్రీమన్నారాయణుడు నారదుడికి చెప్పి అక్కడే ఉన్న చతుర్ముఖుడి వైపు చూసి ‘ఈయన సృష్టికర్త. సమస్త ప్రాణిలోకం ఆవిర్భావానికి అరోధానికి అధిదేవత. ఇపుడు ననె్నక్కడ పుట్టమంటే అక్కడ పుడతాను. ఏం చేయమంటే అది చేస్తాను. కాబట్టి ఈ నిర్ణయం ఆయనే చేస్తే బాగుంటుంది అన్నాడు. అపుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తితో ఇట్లా అన్నాడు.
‘పూర్వం వరుణుడు నా దగ్గరకు వచ్చి విషణ్ణుడై నాకిట్లా చెప్పాడు. పితామహా! నా యజ్ఞ్ధేనువులను కశ్యప మహర్షి అపహరించి తీసుకొనిపోవటంతో ఏమైనా న్యాయముందా? మీరే చెప్పండి. జగదీశా! నేను పోయి ప్రాధేయపడగా కశ్యపుడు నా గోవులు నాకిచ్చి వేస్తానన్నాడు.
- ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు