అక్షర

మనసారా నవ్వకుండా ఉండలేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్యామృతం
(నవరత్నాలు)
రాయవరపు
విశ్వనాథ్ ప్రభు
వెల: 75 రూ.
ప్రతులకు:
ఆర్.వి.ప్రభు, 302,
వాసవి రెసిడెన్సీ,

స్వాతి కల్యాణ మంటపం దగ్గర, పండరిపురం,
అంజయ్యరోడ్, ఒంగోలు- 523001,

రాయవరపు విశ్వనాథ్ ప్రభు సంతరించిన నవ్వుల సంకలనం హాస్యామృతం. జోక్స్, జోక్స్‌తో కూడిన హాస్య గల్పికలు ఇందులో వున్నాయి. జోకుని ప్రజెంట్ చేసే పద్ధతే సారానికి కిక్కు అని బ్నిం అన్నమాట సంకలనకర్తలుగా జోక్స్‌కు వ్యవహరించే వారెవరయినా గుర్తుంచుకోవాల్సిన సంగతే. ప్రతివారూ ఒక జోక్‌కి ఒకేలాగ స్పందించరు అన్నమాట నిజమేగానీ, అందరినీ స్పందింపచేయగల జోక్స్ కూర్చడం నిజమైన ఘనత. అంతర్జాలంలో ‘అచ్చంగా తెలుగు’ లోగిలిలో వెలువరించిన తన హాస్య గుళికలను ఇలా అచ్చురూపంలో ‘లాఫ్టర్ ఈజ్ బెస్ట్ మెడిసిన్’ అన్న తరహా ఓ ‘కిట్’గా అందిస్తున్నారు. భావరాజు పద్మిని గారన్నట్లు చాలావరకు మనకు బజార్లో దొరికే జోక్స్ పుస్తకాలు ఇంగ్లీష్ జోక్స్‌కు అనువాదాలో మునుపటి జోక్స్‌కు అనుసరణలో వుంటాయి. ఇందులోనూ అలాంటివి కొన్ని లేకపోలేదు గానీ ‘ఏ జోక్ ఈజ్ ఎ జోక్ ఈజ్ ఎ జోక్ ఈజ్ ఎ జోక్’ అన్నట్లు నవ్వించే జోక్స్‌కు ‘కాపీ’రైట్ వున్నట్లే!! కానీ తాజాదనం చిప్పిల్లే నవ్‌నవ్ రత్నాలు ఇందులో మీకు దొరుకుతాయన్నది గ్యారంటీ! మచ్చుకి-
‘ఏమండీ! మీరు పెళ్ళిఅయిన కొత్తలో నన్ను ప్రేమగా ‘నా పాలకోవా, నా రసమలాయి, నా పాలాపూరీ అని పిలిచేవారు. మరి ఇప్పుడు అలా పిలవడం మానేశారేం?’’ అంది క్షీర కుమారి.
‘‘ఓసి మాలోకం! పాలతో చేసినవి ఎక్కువ రోజులు నిలవ వుండటం ఎప్పుడయినా చూశావా?’ అన్నాడు పానకాలరావు.
**
నిజం చెప్పొద్దూ! ఏమైనా మెస్సేజ్‌లు వున్నాయేమోనని అస్తమానూ ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తావు.. ఒక్కసారి భగవద్గీత ఓపెన్ చెయ్యి..ఎన్నో మెస్సేజ్‌లు వుంటాయి. మెస్సేజ్‌లు మెస్ చేసిన హాస్యామృతం ఇది నిరభ్యంతరంగా గ్రోలండి.

-సుధామ