క్రీడాభూమి

రోహిత్ అవార్డుల హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అవార్డుల హ్యాట్రిక్ సాధించాడు. ప్రతిష్ఠాత్మకమైన మారుతి సుజికీ ఇఎస్‌పిఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డును వరుసగా మూడోసారి సొంతం చేసుకున్నాడు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘కెప్టెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇటీవలే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్‌కు లభించింది. 2013, 2014 సంవత్సరాల్లో, వనే్డల్లో డబుల్ సెంచరీలను సాధించినందుకు అతనికి అవార్డు లభించింది. 2015 సంవత్సరాలో ‘టి-20 ఇన్నింగ్స్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన అసాధారణ ఇన్నింగ్స్‌ను ఆడినందుకు మరోసారి అవార్డు లభించింది. ఇయాన్ చాపెల్, కొట్నీ వాల్ష్, జాన్ రైట్, మహేల జయవర్ధనే, అజిత్ అగార్కర్, సంజయ్ మంజ్రేకర్, రసెల్ ఆర్నాల్డ్, మార్క్ నికోలస్ సభ్యులుగా ఉన్న ప్యానెల్ సమావేశమై, అవార్డులను ప్రకటించింది. వివియన్ రిచర్డ్స్ సుమారు 30 సంవత్సరాల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలు చేస్తూ, టెస్టుల్లో అత్యంత వేగవంతమైన శతకాన్ని సాధించిన మెక్‌కలమ్‌ను అవార్డుకు ఎంపిక చేసింది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు టెస్టుల్లో అత్యుత్తమ బౌలర్ అవార్డు లభించింది. ఆస్ట్రేలియాతో నాటింగ్‌హామ్‌లో జరిగిన నాలుగో టెస్టులో అతను కేవలం 15 పరుగులకే ఎనిమిది వికెట్లు పడగొట్టినందుకు ఈ అవార్డును దక్కించుకున్నాడు. అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్‌గా కేన్ విలియమ్‌సన్ సాధించిన 242 పరుగుల స్కోరు ఎంపికైంది. శ్రీలంకతో వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ స్కోరు సాధించాడు. వనే్డ ఇన్నింగ్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎబి డివిలియర్స్‌కు లభించింది. జొహానె్నస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 31 బంతుల్లో 149 పరుగులు చేశాడు. వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఉత్తమ బౌలింగ్ అవార్డు టిమ్ సౌథీకి లభించింది. ఇంగ్లాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ కివీస్ పేసర్ 33 పరుగులకు 7 వికెట్లు కూల్చాడు. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్త్ఫాజుర్ రెహ్మాన్‌కు ఉత్తమ డెబ్యుటెంట్ అవార్డు దక్కింది.