సంజీవని

తలనొప్పులకు సొంత వైద్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా తలనొప్పికి పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటారు. తరచు తలనొప్పి వస్తుంటే అది ఏ తరహాకు చెందినదో తెలుసుకుని తగిన వైద్య చికిత్స చేయించుకోవాలి. ఏ రకమైన తలనొప్పికయినా ఇప్పుడు వైద్య చికిత్స లభిస్తోంది. సొంతంగా మందులు వేసుకుంటే ఒక్కొక్కప్పుడు కొత్త సమస్యలు నెత్తిమీదకు వ స్తాయి.
తలనొప్పులు అనేక రకాలు. సాధారణంగా విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. నొప్పితోపాటు ఇతర సమస్యలు తోడ్పయితే తలనొప్పికి కారణాలు అనే్వషించి అది ఏ రకం తలనొప్పి అనే విష యం తెలుసుకోవాలి.
మైగ్రేన్, క్లస్టర్ తలనొప్పి, అసాధారణ తలనొప్పులు, మిశ్రమ తలనొప్పులు, ఇన్‌ఫెక్షన్ తలనొప్పి, మెదడులో ట్యూమర్, ఫంగస్‌వల్ల హ్యామరేజ్ తలనొప్పి, దృష్టి దోషంవల్ల తలనొప్పి... ఇలా అనేక రకాలుగా ఉంటాయి తలనొప్పులు.
కొన్ని కారణాలు.. తలనొప్పి రావడానికి గల కొన్ని కారణాలు తెలుసుకుందాం.
మెదడులోపల లేదా ఉపరితలంపై వున్న రక్తనాళాలు ఉబ్బడం, సాగడం లేదా ఒత్తిడికి లోను కావడం.
తల లేదా మెడలో ఉండే కండరాలు బిగియడంవల్ల
మెదడు లోపల పీడనం ఎక్కువయినపుడు
కపాలంలోని ఎముకల ఇన్‌ఫ్లమేషన్‌వల్ల
మెదడుపై ఉండే పొరల ఇన్‌ఫ్లమేషన్‌వల్ల.. ఇలా ఎనె్నన్నో కారణాలుగా తలనొప్పులు వస్తూ ఉంటాయి.
మైగ్రేన్ (పార్శ్వపునొప్పి)
మైగ్రేన్ తలనొప్పులలో సర్వసాధారణమయినది. ఇది తలకు ఒక వైపు వస్తుంది. కళ్లముందు మెరుపులు మెరిసినట్లుండడం లేదా గీతలు కన్పించడంతో ఇది మొదలవుతుంది. వాంతులు, వికారంతో కలసి వస్తుంది.
మైగ్రేన్ తలనొప్పి వచ్చినపుడు వెలుతురు చూడడం, గట్టి శబ్దాలు వినడం కష్టంగా ఉంటుంది.
మైగ్రేన్ హార్నోల్ ప్రాబ్లమ్‌వలన పురుషుల్లో కన్నా స్ర్తిలలోనే ఎక్కువగా వస్తుంది. టీనేజ్ అమ్మాయిల్లో ఎక్కువ.
అమ్మాయి వయసు పెరుగుతుంటే సాధారణంగా దానంతటదే ఈ తలనొప్పి తగ్గిపోతుంది.
ఈ నొప్పి ఉదయం మొదలయి క్రమక్రమంగా తీవ్రమవుతుంది.
నివారణ పద్ధతులు
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
తరచు కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం వంటి పనులు చేయకూడదు.
సొంతంగా పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. వైద్యుని సలహా మేర పెయిన్ కిల్లర్స్‌తోపాటు, కాల్షియం చానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ వంటి మందులు వేసుకోవాలి.
ప్రశాంతంగా అనుదినం ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
శరీరానికి పడని ఆహార పదార్థాలు తినకూడదు.
క్లష్టర్ తలనొప్పి.. తలనొప్పులన్నింటిలోను భరించలేని తలనొప్పి ఇది. సాధారణంగా తెల్లవారే ముందు రోగి నిద్రపోతున్న సమయంలో వచ్చి, అతనిని మేల్కొలుపుతుంది.
మొదట్లో ఈ నొప్పి ఒక కంటిమీద ప్రారంభమయి 10 నిముషాల్లో భరించలేనంతగా తీవ్రం అవుతుంది. ఇది అతి నికృష్టమైన తలనొప్పి.
బాధకు గురయిన కన్ను ఎర్రబడి, నీళ్లు కారతాయి. అదే పార్శ్వంలో వున్న నాసిక రంధ్రం మూసుకుపోయినట్లు అన్పిస్తుంది. దాని నుండి ద్రవం కారుతుంది.
ఈ విధంగా 6-8 వారాలపాటు రోగి ప్రతి రాత్రి బాధపడక తప్పదు. దీనిని ఆత్మహత్య తలనొప్పి అని కూడా అంటారు. ఎందుకంటే కొంతమంది రోగులు ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకుంటారు.
చికిత్స
క్లష్టర్ తలనొప్పి సాధారణంగా తలనొప్పి మందులతో తగ్గదు.
రోగిని చికిత్సలో భాగంగా ఆసుపత్రిలో జేరిస్తే ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది.
ఈ నొప్పి తగ్గడానికి కొన్ని కార్టిజాన్స్, స్టెరాయిడ్స్‌తోబాటు యాంటీఎపిలెప్టిక్ మందులు వాడుతారు వైద్యులు.
అసాధారణ తలనొప్పుల్లో అత్యంత తీవ్రమైన తలనొప్పి సబర్కనాయిడ్ హ్యుమరేజ్ తలనొప్పి. ఈ తలనొప్పి భరించలేక రోగి నేలమీద పడి దొర్లి బాధపడుతూ ఉంటాడు.
ఈ నొప్పి రావడానికి కారణం రక్తనాళాలు చిట్లి మెదడు చుట్టూ ఉండే పొరల్లోకి రక్తం ప్రవహించి సెరిబ్రోస్ఫైనల్ ఫ్లూయిడ్‌తో కలవడం. ఈ నొప్పికి వెంటనే చికిత్స అందాలి. లేకపోతే ప్రాణాపాయ స్థితి రావచ్చు.
మైగ్రేన్ తలనొప్పికి సంబంధించిన పరిశోధనలలో ఈ నొప్పి రావడానికి ముందు మెదడులో మెగ్నీషియం స్థాయి బాగా తగ్గినట్లు గుర్తించారు. మెదడులో మెగ్నీషియం ఏ మాత్రం తేడాకు లోనైనా తలనొప్పి వస్తుందని తెలుసుకున్నారు.
మెదడులో మెగ్నీషియంకు రెండు బాధ్యతలు వున్నాయి. నాడీ కణాలపై మెంబ్రేన్లను స్థిరీకరించడం, న్యూరాన్లలో ఉండే పలు రకాలైన ఎంజైములు సరిగా పనిచేసేలా చేయడం. మెగ్నీషియం లెవెల్స్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా న్యూరాన్లు అస్థిరం అవుతాయి. దానివల్ల మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.

-సి.వి.