రాష్ట్రీయం

నెల్లూరు హెడ్మాస్టర్ ఆస్తులు మూడు కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 10: ఓ హెడ్మాస్టరు సుమారు మూడు కోట్ల మేర అక్రమ ఆస్తులు కలిగి, ఏసిబి అధికారులకు చిక్కిన వైనం ఇది. ఏసిబి అధికారుల కథనం మేరకు నెల్లూరు నగరంలోని మూలాపేట బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్న బూదం సురేష్ అక్రమ ఆస్తి కలిగి ఉన్నాడని ఎసిబి అధికారులకు అందిన సమాచారంతో గురువారం ఆయన ఆస్తులపై సోదాలు చేపట్టారు. ఏకకాలంలో నగరంలోని ఆయన ఇంటిపై నాయుడుపేట, పొదిలి కనపర్తిపాడు, గొలగమూడి, చెముడుగుంట ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరు ప్లాట్లు మూలాపేటలో మూడు అంతస్తుల భవనం, నాలుగు వందల గ్రాముల బంగారం కొన్ని పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలం నుండి సురేష్‌పై ఏసిబి అధికారులు నిఘాపెట్టి గురువారం ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసిబి ఇన్‌స్పెక్టర్ తోట ప్రభాకర్, సిఐ శివకుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.