అంతర్జాతీయం

బాల్‌ఠాక్రేను చంపాలనుకున్నాం: హెడ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయిలో వరుస బాంబుదాడులకు ముందే శివసేన పార్టీ అధినేత బాల్‌ఠాక్రేను హతమార్చేందుకు తాము వ్యూహరచన చేసినట్లు ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడైన డేవిడ్ హెడ్లీ వివరించాడు. ముంబయి పేలుళ్లకు సంబంధించి పాక్-అమెరికన్ ఉగ్రవాది అయిన హెడ్లీని న్యూయార్క్ జైలు నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ముంబయి కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం విచారణలో ఆయన బాల్‌ఠాక్రే హత్యకు కుట్రపన్నామని, శివసేన కార్యాలయంపై రెండుసార్లు రెక్కీ నిర్వహించామని అయినా హత్యచేయలేకపోయామని వివరించాడు. ముంబయి దాడులకు సంబంధించి తాను అమెరికా అధికారులకు కూడా విచారణలో సహకరించినట్లు తెలిపాడు.