ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రలో హడలెత్తిస్తున్న వేసవి తీవ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో జనం వేసవి తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం నాడు సగటు కంటే మూడు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
అనంతపురం, కర్నూలు, నంద్యాలలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామ, తునిలో 41 డిగ్రీలు, విజయవాడ, తిరుపతి, కడపలో 40 డిగ్రీలు, నెల్లూరు, మచిలీపట్నంలో 39డిగ్రీలు, కావలి, ఒంగోలు, విశాఖలో 38 డిగ్రీలు, బాపట్ల, నరసాపురంలో 36 డిగ్రీలు, కళింగపట్నంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. సోమవారం మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.