ఆంధ్రప్రదేశ్‌

పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు పులిచింతల వద్దే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల వరకే నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ జలవనరుల శాఖతో మాట్లాడి నల్గొండ జిల్లాలోని రేబల్లి, నెమలిపురి, చింతిర్యాల, కృష్ణాపురం గ్రామాలను ఖాళీచేయించారు. గుంటూరులోని రేగులగడ్డ, గోవిందాపురం, బోధనం గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా పులిచింతల వద్ద పరిస్థితిని సమీక్షించారు.