జాతీయ వార్తలు

బాధితులకు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదివేల ఇళ్ల నిర్మాణం
10, 5వేల చొప్పున పరిహారం
పదికిలోల బియ్యం, పంచె, చీర పంపిణీ
పంట నష్టానికి రూ.13,500 చెల్లింపు
ప్యాకేజీ ప్రకటించిన సిఎం జయలలిత
వర్షాలు, వరదల బారిన పడిన బాధిత ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహాయ ప్యాకేజీ ప్రకటించారు. పదివేళ ఇళ్లను నిర్మిస్తామని, పది, ఐదువేల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. బాధితులకు ధోవతి, చీరెను ఇస్తామని, ఆర్థిక లబ్ధి మొత్తాన్ని ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. పది కిలోల బియ్యం, ధోవతి, చీరెను ప్రభుత్వ పంపిణీ దుకాణాల ద్వారానే సరఫరా చేస్తామని తెలిపారు. వరదల వల్ల పంటను కోల్పోయిన రైతుల్ని ఆదుకుంటామని, అలాంటి వారికి హెక్టారుకు 13వేల 500 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా బాధిత ప్రజల వివరాలను సేకరించి సహాయ, సంక్షేమ చర్యల అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.