క్రీడాభూమి

సంపాదనలో హీరో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, డిసెంబర్ 26: టెన్నిస్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఎవరూ కేవలం మ్యాచ్ ఫీజు, ప్రైజ్‌మనీ రూపంలో 100 మిలియన్ డాలర్లు (సుమారు 661 కోట్ల రూపాయలు) సంపాదించలేదు. ఈ మ్యాజికల్ ఫిగర్‌ను చేరేందుకు సూపర్ స్టార్లు నొవాక్ జొకొవిచ్, రోజర్ ఫెదరర్ పరుగులు తీస్తున్నారు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న జొకోవిచ్ ఆదాయం ఇప్పటి వరకూ 94 మిలియన్ డాలర్లుకాగా, అతని కంటే ఆరు సంవత్సరాలు ముందుగానే ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన ప్రపంచ మూడో ర్యాంకర్ ఫెదరర్ ఆదాయం 97.3 మిలియన్ డాలర్లు. జనవరిలో జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌తో వచ్చే ఏడాది సీజన్ మొదలవుతుంది. ఈ టోర్నీ విజేతకు 3.85 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఫెదరర్ ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీని కైవసం చేసుకుంటే, అతను 100 మిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమిస్తాడు. కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన ఫెదరర్ 2012 తర్వాత ఒక్క గ్రాండ్ శ్లామ్‌ను కూడా అందుకోలేకపోయాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న చిరస్మరణీయ విజయాన్ని సాధించాలన్న పట్టుదల కూడా ఫెదరర్‌లో కనిపిస్తున్నది.
జొకోవిచ్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 21.5 మిలియన్ డాలర్లు సంపాదించాడు. అతని ఫామ్‌ను చూస్తుంటే, వచ్చే ఏడాది కూడా వివిధ టోర్నీల్లో ప్రైజ్‌మనీని భారీగానే అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెదరర్ కంటే ముందుగానే అతను 100 మిలియన్ డాలర్ల ఫిగర్‌ను అదుకోవడం అసాధ్యమేమీ కాదు. ఫెదరర్ కంటే ఆరు సంవత్సరాలు ఆలస్యంగా టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన జొకోవిచ్ చాలా వేగంగానే ఎక్కువ ప్రైజ్‌మనీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫెదరర్ కంటే అతను కేవలం 3.3 మిలియన్ డాలర్లు వెనుకంజలో ఉన్నాడు. దీనిని భర్తీ చేసుకోవడమేగాక, ఫెదరర్‌ను వెనక్కునెట్టి రేసులో ముందుకు దూసుకుపోయే సత్తా జొకోవిచ్‌కు ఉంది. ఎవరు ముందుగా 100 మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుతారన్నది ఆసక్తిని రేపుతున్నప్పటికీ, జొకోవిచ్‌నే ఫేవరిట్‌గా పేర్కోవాలి. రాడ్ లెవర్ తర్వాత ఒక క్యాలండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పే అవకాశాన్ని జొకోవిచ్ ఈ ఏడాది కొద్దిలో చేజార్చుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ సాధించలేకపోవడంతో అతని క్యాలండర్ శ్లామ్ పూర్తికాలేదు. గత సీజన్‌లో జొకోవిచ్ 88 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం ఆరు పరాజయాలను మాత్రమే ఎదుర్కొన్నాడు. 82 విజయాలు అతని సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే అతను వంద మిలియన్ డాలర్ల మైలురాయిని సులభంగా అధిగమిస్తాడు. మొత్తం మీద వచ్చే ఏడాది ఇద్దరూ వంద మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పూర్తి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎవరు ముందుగా ఆ ఫిగర్‌ను చేరుకుంటారన్నదే ఆసక్తి రేపుతున్నది. ఫెదరర్ కం టే జొకోవిచ్ ముందున్నట్టు కనిపిస్తోంది.
ఇలావుంటే, మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ 74 మిలియన్ డాలర్ల ఆన్ కోర్టు ఆదాయంతో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, మరియా షరపోవా 36.4 మిలియన్లతో రెండో స్థానంలో ఉంది.