రాష్ట్రీయం

అత్యాచారం కేసులను త్వరితగతిన విచారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య
హైదరాబాద్, మార్చి 11: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కింది కోర్టులు మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, దీని వల్ల బాధితులకు న్యాయం చేకూరుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి చంద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మహిళలపై అత్యాచారాలకు సంబంధించి విచారించే రెండు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రారంభించారు. ఈ కేసుల విచారణలో జాప్యం తగదన్నారు. కోర్టులు నిందితులకు తగిన శిక్షలు విధించడం వల్ల ప్రజలకు నేరాలంటే భయం పెరుగుతుందన్నారు. ఈ కేసుల్లో బాధితులు తగిన న్యాయ సహాయం కోసం కోర్టుల వైపు ఎదురు చూస్తుంటారని అన్నారు. వారి నమ్మకాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంటుందన్నారు.