తెలంగాణ

హైకోర్టు విభజనపై వాదనలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : హైకోర్టు విభజనపై వాదనలు గురువారం పూర్తి అయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వే చేసింది. ఏపీకి ప్రత్యేక హైకోర్టు కేటాయించాలని దాఖలైన ఫిటిషన్‌పై ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తామింకా రాజధాని నిర్మించుకోలేదని, దానికి అవసరమైన నిధులు కేంద్రం సమకూర్చడంలేదన్న విషయాన్ని కోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టును నిర్మించుకునే స్థాయిలో ప్రభుత్వం లేదు కాబట్టి ఫిటిషన్‌ను కొట్టివేయాలని ఏపీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసుకునేందుకు తాము సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వాదనలు వినిపించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం రూ. 15 వందల కోట్లు ఇచ్చామని తెలిపింది. ఇప్పటికే సెక్రటేరియట్‌ను పూర్తిగా అమరావతికి తరలిస్తున్న తరుణంలో ఆ నిధులను హైకోర్టు కోసం వినియోగించు కోవచ్చునని సోలిసిట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. మూడు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.