రాష్ట్రీయం

ఎస్‌బిహెచ్ బ్యాంక్ స్కాంపై సిబిఐ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
హైదరాబాద్, డిసెంబర్ 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని మల్లికార్జున్‌నగర్ బ్రాంచిలో వెలుగుచూసిన ఖాతాల బదలాయింపు కుంభకోణంపై సిబిఐ కేసు నమోదు చేసింది. గత నెల 13న మల్కాజ్‌గిరితోపాటు రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లాలకు చెందిన మూడు బ్యాంకుల్లో సుమారు 38కోట్ల రూపాయలు ఇతర ఖాతాల్లోకి బదిలీ అయిన విషయం విదితమే. ఈ కుంభకోణంలో ఓ బ్యాంకు అధికారి, రిటైర్డ్ అధికారితోపాటు ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులు కాగా, ఒకరు పరారీలో ఉన్నారు. ప్రభుత్వ డిపాజిట్లను ప్రైవేటు వ్యక్తుల పేరిట బదలాయించిన కీలక సూత్రధారి దామోదర్ పరారీలో ఉండగా కేసు విచాణర కొంతమేరకే సాగింది. దీంతో ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టాలంటూ రాష్ట్ర హైకోర్టు సిబిఐని ఆదేశించింది. కాగా శుక్రవారం హైకోర్టు ఆదేశాలు వెలువడడంతో శనివారం సిబిఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు ఓ సిబిఐ సీనియర్ అధికారి తెలిపారు.