అంతర్జాతీయం

చరిత్ర సృష్టించిన హిల్లరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడల్ఫియా, జూలై 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇదో సరికొత్త శకం. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళ హిల్లరీ. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో వీరిద్దరి మధ్యే దేశాధ్యక్ష పదవికి తీవ్ర పోటీ జరుగబోతోంది. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో హిల్లరీకి 4764మంది డెలిగేట్ల మద్దతు లభించింది. అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం చివరి వరకూ పోరాడిన బెర్నీ సాండర్స్ మారిన పరిస్థితుల నేపథ్యంలో హిల్లరీ పేరును స్వయంగా ప్రతిపాదించారు. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్న వాస్తవాన్ని ఈ చర్య ద్వారా ధ్రువీకరించారు. ఓ మహిళకు ఈ అవకాశం ఇవ్వడానికి వీలుగా పార్టీ నిబంధనలనూ మార్చాలని, ఆమెను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ప్రకటించాలన్నారు. కాగా, నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ విజయం సాధించగలిగితే..ఈ పదవిని అధిరోహించిన తొలి మహిళగానూ ఆమె మరో చరిత్రా సృష్టించగలుగుతారు. వేలాది మంది మద్దతుదారుల్ని ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడిన హిల్లరీ ‘ఇది మీ విజయం. మీరు సాధించుకున్న విజయం. ఈ వార్త కోసం రాత్రంతా ఎదురుచూశారు. మీలో ఆడపిల్లలు కూడా ఉంటే వారికి నాదో సందేశం. నాలాగే మీలో ఒకరు ఏదో ఒక రోజు దేశాధ్యక్ష పదవిని చేపట్టనూ వచ్చు.అందుకు ఇది నాంది’అని అన్నారు. న్యూయార్డ్ నుంచి వీడియోలో ఆమె మాట్లాడారు.
chitram...
డెమొక్రటిక్ పార్టీఅభ్యర్థిగా ఖరారైన తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి వీడియోలో మాట్లాడిన హిల్లరీ