జాతీయ వార్తలు

‘బియాస్’ మృతులకు 20 లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల తల్లిదండ్రులకు అందించాలని హిమాచల్ హైకోర్టు ఆదేశం
సిమ్లా, జనవరి 2: హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతిచెందిన హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు తలా 20 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం ఆదేశించింది. 2014 జూన్ 8న హైదరాబాద్‌లోని విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు కులూ జిల్లాలోని తలోట్ వద్ద బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ పరిహారాన్ని ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే చెల్లించిన 5 లక్షల రూపాయల తాత్కాలిక పరిహారంతో కలుపుకొని పరిహారం సొమ్మును ప్రమాదం జరిగిన రోజునుంచి సొమ్ము అందే తేదీ దాకా ఏడాదికి 7.5 శాతం వడ్డీతో చెల్లించాలని ప్రధాన న్యాయమూర్తి మన్సూర్ అహ్మద్ మిర్, జస్టిస్ తార్‌లోక్ సింగ్ చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్ విద్యుత్ బోర్డు, ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాన్ని 60:30:10 నిష్పత్తిలో భరించాలని ఆదేశించిన కోర్టు ఈ ప్రమాదంలో బోర్డు బాధ్యత ఎక్కువని, అందువల్ల అది 60 శాతం పరిహారాన్ని చెల్లించాలని అభిప్రాయపడింది. కళాశాల యాజమాన్యం కూడా విహార యాత్రకు ప్రణాళిక వేసుకోవడానికి ముందు ఈ ప్రాంతంలోని అన్ని పరిస్థితులను అంచనా వేసుకుని ఉండాల్సిందని బెంచ్ అభిప్రాయ పడింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తనకు తానుగా వ్యవహారాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన కోర్టు నష్ట పరిహారం చెల్లించడానికి మాత్రమే తమ విచారణ పరిమితమైందని, ఇతర సివిల్, క్రిమినల్ కేసులకు గానీ లేదా డిపార్ట్‌మెంటల్ దర్యాప్తుకు కానీ ప్రాతిపదిక కాబోదని స్పష్టం చేసింది.