రాష్ట్రీయం

హిందువుగా పుట్టినందుకు గర్వంగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువుగా పుట్టినందుకు
గర్వంగా ఉంది
సృష్టికర్తను దర్శించుకోవడం నా అదృష్టం
విహెచ్‌పి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా

చేబ్రోలు, డిసెంబర్ 3: భారతదేశంలో హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని, ప్రపంచంలోనే అరుదైన చతుర్ముఖ బ్రహ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్‌భాయ్ తొగాడియా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామి దేవాలయాన్ని తొగాడియా గురువారం రాత్రి సందర్శించారు. తొలుత వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాద్యాల నడుమ పూర్ణకుంభంతో తొగాడియాను ఆలయ ఇఒ గట్టుపల్లి పాండురంగారావు, వ్యాపారవేత్త పాటిబండ్ల లక్ష్మీనరసింహారావు ఆలయంలోకి సాదర స్వాగతం పలికారు.
చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం చుట్టూ తొగాడియా ప్రదక్షిణలు చేశారు. బ్రహ్మను దర్శించుకుని సంతుష్టులయ్యారు. వేదమంత్రోచ్ఛారణ చేస్తున్న అర్చకులతో కలిసి తొగాడియా కూడా గొంతు కలిపారు. ఆలయ అపురూప శిల్పకళకు అచ్చెరువొంది తొగాడియా ఆలయ శిల్పకళను స్వయంగా తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు. క్రీస్తుశకం 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు నిర్మించిన ఈ దేవాలయం చుట్టూ వైష్ణవ, శైవ దేవాలయాలతో పాటు శక్తిపీఠాలు ఉండటం చాలా విశేషమన్నారు. ముల్లోకాల్లో బ్రహ్మకు ఎక్కడా పూజలు జరగనప్పటికీ చేబ్రోలులోని చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామికి పూజలు జరగడం అరుదైన విషయమన్నారు. చతుర్ముఖ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆయన ఆకాంక్షించారు. విశ్వహిందూ పరిషత్ తరఫున ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తొగాడియా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఇఒ పాండురంగారావు పట్టువస్త్రాలతో తొగాడియాను ఘనంగా సత్కరించారు. అలాగే వ్యాపారవేత్త పాటిబండ్ల లక్ష్మీనరసింహారావు తొగాడియాను పూలమాలలతో సన్మానించారు.
ఆలయ విశిష్ఠత గురించి అర్చకులు సత్యనారాయణ తొగాడియాకు ఆంగ్లంలో అనువదించి వివరించారు. అనంతరం వాసిరెడ్డి శంకరరావు ఇంటికి వెళ్లి కొద్దిసేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. తొగాడియా వెంట భజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు చిరుమామిళ్ల గోపికృష్ణ, బిజెపి నాయకులు సతీష్, పాలడుగు శ్రీనివాసరావుతో పాటు అర్చకులు డాక్టర్ ఫణిహారం శ్రీ్ధర్, ఫణిహారం కళాధర్ ఉన్నారు.