క్రీడాభూమి

ఇండియన్ వెల్స్ టెన్నిస్ సాన్‌టినా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 12: ‘సాన్‌టినా’గా అభిమానులు పిలుచుకునే మార్టినా హింగిస్, సానియా మీర్జా జోడీ ఇక్కడ ఆరంభమైన ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో వీరు కాసీ డెలాక్వా, సమంతా స్టొసుర్ జోడీని 6-3, 7-5 తేడాతో చిత్తుచేశారు. మొదటి రౌండ్‌లో సత్తా చాటలేకపోయిన డెలాక్వా, స్టొసుర్ రెండో రౌండ్‌లో ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో ఎంతో అనుభవాన్ని సంపాదించిన ‘సాన్‌టినా’ జోడీ సులభంగానే సమస్య నుంచి బయటపడింది. వరుస సెట్లలో గెలిచి, రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.
సెరెనా ముందంజ
మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో లారా సీగెమండ్‌ను 6-2, 6-1 తేడాతో చిత్తుచేసిన ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో నికోల్ గిబ్స్ 6-3, 6-3 తేడాతో మాడిసన్ కీస్‌ను, సిమోనా హాలెప్ 6-1, 6-1 ఆధిక్యంతో వనియా కింగ్‌ను, జొహాన్నా లార్సన్ 5-7, 6-4, 6-2 స్కోతో సబినే లిసికీని ఓడించారు. లూసీ సఫరోవాకు యార్లొస్లొవా ష్వెడొవా నుంచి ఊహించని ఫలితం ఎదురైంది. ష్వెడొవా మ్యాచ్‌ని 6-3, 6-4 తేడాతో గెల్చుకొని సంచలనం సృష్టించింది.