రాష్ట్రీయం

ఆర్టీసిలో అద్దె చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30 శాతానికి చేరిన హైర్ బస్సులు
తాజాగా 800 బస్సులకు టెండర్లు
9న నోటీసు ఇవ్వనున్న ఇయు
ఆందోళనకు కార్మికులు సిద్ధం
హైదరాబాద్, డిసెంబర్ 6: ఆంధ్ర ఆర్టీసీని అద్దె బస్సుల రగడ కుదిపేస్తోంది. యాజమాన్యం తాజాగా మరో 800 బస్సులకు టెండర్లు పిలవడంతో, కార్మిక సంఘాలు కత్తులు నూరుతున్నాయి. ఈనెల 9న ఆర్టీసీ యాజమాన్యానికి తక్షణమే అద్దె బస్సుల ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ నోటీసు ఇవ్వనుంది. 3 వేల కోట్ల నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీని ఆర్ధికంగా కృంగదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కుమ్మక్కై ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నాయని, ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఆంధ్ర ఆర్టీసీలో ప్రస్తుతం 12,200 ఆర్టీసీ బస్సులున్నాయి. గతంలో అద్దె బస్సులు నడపొద్దని హైకోర్టు సైతం ఆర్టీసీకి సూచించింది. కానీ ఇవన్నీ పక్కనపెట్టి ఆర్టీసీ యాజమాన్యం ఇంతవరకు రెండు వేల వరకూ అద్దె బస్సులు ప్రవేశపెట్టింది. తాజాగా మరో 800 అద్దె బస్సులను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో తొలి విడతగా నాలుగు వందల వరకూ ఆర్టీసి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టనుంది. కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ ప్రైవేట్ సంస్థల వారే ఉంటారు. దీనివల్ల అద్దె బస్సులపై ఆర్టీసీ పట్టు తప్పుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పది శాతం వరకూ అద్దె బస్సులు ఉంటే ఫర్వాలేదని, ఎకాఎకిన మొత్తం బస్సుల్లో 30శాతం అద్దె బస్సులుంటే ఆర్టీసీ దెబ్బతింటుందని ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి దామోదరరావు తెలిపారు. ఆర్టీసీనే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని బస్సులను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే ఆర్టీసీలో సిబ్బంది ఓటి తగ్గించారని, సిబ్బంది సంఖ్యను తగ్గించేందుకు అద్దె బస్సులను పెంచుతున్నారని కార్మిక సంఘాల అభియోగం. ఈనెల 9న ఆంధ్ర రాష్ట్రంలో కడప, విజయవాడ, విజయనగరం, నెల్లూరులోని ఆర్టీసీ కార్యాలయాల్లో అద్దె బస్సులు పెంపుదల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్ నోటీసులు ఇవ్వడమే కాకుండా, అదే రోజు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయనుంది. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని, ఉద్యోగులకు పదవీ విరమణ బెనిఫిట్లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వి దామోదరరావు తెలిపారు.

=====
ఆర్టీసీలో అద్దె బస్సుల నిర్వహణ అన్యాయం
* టెండర్లను నిలిపివేయకపోతే ఉద్యమిస్తాం
* ఆర్టీసీ ఎన్‌ఎంయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు
విశాఖపట్నం, డిసెంబర్ 6: ఆర్టీసీ సంస్థకు తీవ్ర నష్టాన్ని కలిగించే అద్దె బస్సుల నిర్వహణకు యాజమాన్యం సిద్ధపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎన్‌ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎన్‌ఎంయు సెంట్రల్ కమిటీ ఆదివారం విశాఖలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపకపోతే ఉద్యమానికి దిగుతామన్నారు. దీనిలో భాగంగా నెల 11, 12 తేదీల్లో రాష్టవ్య్రాప్తంగా ఉన్న 126 డిపోల్లో నాన్ ఆపరేషన్ యూనిట్లలో రిలే నిరాహారదీక్షలు చేపడతామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్లను తక్షణమే నిలుపుదల చేసి ఆ స్థానంలో ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యం ఏకపక్షంగా అమలు చేస్తున్న సింగిల్ క్రూ, టిమ్స్, వన్‌మేన్ సర్వీసులను నిలుపుదల చేసి కార్మికవర్గంలో ఆందోళనను తొలగించాలన్నారు. ఓఆర్ తక్కువ పేరిట బస్సులు తగ్గించే విధానం ఆపడం, ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో ప్రైవేటు వారికి బిఒటికు ఇవ్వకుండా సంస్థ ద్వారానే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టవ్య్రాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న క్లరికల్, సూపర్‌వైజర్ల ఖాళీల భర్తీతోపాటు పదోన్నతులు కల్పించాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, పలు విభాగాల్లో అవుట్‌సోర్సింగ్‌ను నిలుపుదల చేసి ఆర్టీసీతో నిర్వహించాలన్నారు. మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న లీవు ఎన్‌కేష్‌మెంట్, నాలుగు మాసాల డిఏ ఏరియర్స్‌ను వెంటనే మంజూరు చేయాలనే 18 రకాలైన సమస్యలు గత కొనే్నళ్ళుగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. ఎన్‌ఎంయు చైర్మన్ ఆర్‌వివిఎస్‌డి ప్రసాద్, అధ్యక్షులు సి.చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి, పివివి మోహన్‌లు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు.