హైదరాబాద్

ఫేక్ ఇంటర్వ్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: నగరంలో ఇప్పటి వరకు సైబర్ నేరాలు, చైన్ స్నాచింగ్‌లు, ఏటిఎంల చోరీలు, ఫేక్ కరెన్సీ వంటి నేరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. తాజాగా ఫేక్ ఇంటర్వ్యూల మోసగాళ్లు పుట్టుకొస్తున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ కాలనీలో ఓ ముఠా ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడింది. కెపిహెచ్‌బి ఐదవ, ఫేజ్ హెచ్‌ఐజి 102, డి మార్ట్‌లో ఐఐసి టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ లోగోతో హెచ్‌ఆర్ మేనేజర్ పేరుతో ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసగిస్తున్న ఈ ముఠా సమాచారం తెలిసిన ఐఐసి టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విశాల్ దత్త, క్రాంతి కిరణ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, టాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు వీరు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40మంది యువతీ, యువకులను ఇంటర్వ్యూ చేసినట్టు కెపిహెచ్‌బి పోలీసులు తెలిపారు. ః