రాష్ట్రీయం

హోర్డింగుల ఏర్పాటుపై అఫిడవిట్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 12: విజయనగరంలో బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ హోర్డింగ్స్‌ను అమర్చడంపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విజయనగరంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మనోజ్ కుమార్ జైన్ అనే వ్యక్తి పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కమిషనర్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలపై తీసుకున్న చర్యలు, అమలులో ఉన్న నియమావళిని తెలియచేయాలని ఆదేశించారు. అనంతరం పిటిషన్ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు.