క్రీడాభూమి

హాకీని వీడని వివాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు - 2015
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌లు 2015లో భారత్ గర్వపడేలా చేస్తే క్రీడారంగంలో చోటు చేసుకున్న మరికొన్ని సంఘటనలు క్రీడాభిమానుల దృష్టిని వీటినుంచి మళ్లేలా చేసాయి. అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయిన బాక్సింగ్ ఇండియా సస్పెన్షన్ మొదలుకొని హాకీ ఇండియా కోచ్ పాల్ వాన్ హాస్‌ను అర్ధంతరంగా తొలగించడం దాకా, భారత ఫుట్‌బాల్ అథః పాతాళానికి పడిపోవడం మొదలుకొని వెయింట్ లిఫ్టింగ్ రంగాన్ని డోపింగ్ వివాదం ఇంకా వెంటాడుతుండడం దాకా అనేక సంఘటనలు ఈ ఏడాది క్రీడాభిమానులను కలతపెట్టాయి.
అన్నిటికన్నా మించి జాతీయ క్రీడ అయిన హాకీలో ఆటగాళ్లు సాధించిన ఘన విజయాలకన్నా తెరవెనుక చోటు చేసుకున్న సంఘటనలే ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జాతీయ జట్టు కోచ్ పాల్ వాన్ ఆస్‌ను అర్ధంతరంగా పదవినుంచి తప్పించిన తీరు ఓ చిన్నపాటి తుపానునే సృష్టించిందని చెప్పాలి. ఆంట్‌వెర్ప్‌లో జరిగిన ప్రపంచ హాకీ లీగ్ ఉమీ ఫైనల్ టోర్నమెంట్‌నుంచి భారత జట్టు తిరిగి వచ్చిన వెంటనే హాకీ ఇండియా అధ్యక్షుడు నరిందర్ బాత్రా, జట్టు కోచ్ పాల్ వాన్ ఆస్‌ల మధ్య పెను వివాదమే తలెత్తింది. ఇరువురూ కొద్ది రోజుల పాటు ఒకరిపై మరొకరు బురదజల్లుకున్న తర్వాత వాన్ ఆస్‌ను అర్ధంతరంగా కోచ్ పదవినుంచి తప్పించారు. కోచ్‌గా నియమించి ఆరు నెలలు గడవక ముందే ఆస్‌ను పదవినుంచి తప్పించడం గమనార్హం. అయితే హాకీ వరల్డ్ లీగ్ సెమీ ఫైనల్‌లో మలేసియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత బాత్రాతో జరిగిన గొడవే తనను కోచ్ పదవినుంచి తప్పించడానికి కారణమని ఆ తర్వాత వాన్ ఆస్ నెదర్లాండ్స్‌నుంచి మీడియాకు చెప్పాడు. ఆ తర్వాత రోలంట్ ఓల్ట్‌మాన్స్‌కు 2016లో జరగబోయే రియో ఒలింపిక్స్ దాకా హాకీ ఇండియా కోచ్ బాధ్యతలను అప్పగించడం జరిగింది.
హాకీ ఇండియా ఈ ఏడాది మరో వివాదానికి కూడా గురయింది. తోటి ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించాడన్న కారణంగా మిడ్‌ఫీల్డర్ గుర్బజ్ సింగ్‌ను హాకీ ఇండియా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అతనిపై తొమ్మిది నెలల పాటు సస్పెన్షన్ విధించారు. తనపై విధించిన సస్పెన్షన్‌పై సింగ్ అపీల్ చేసుకోగా హాకీ ఇండియా దాన్ని తోసిపుచ్చింది. దీంతో అతను హాకీ ఇండియాను కోర్టుకు లాగాలని నిర్ణయించుకున్నాడు. విచారణ తర్వాత కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ అప్పటికే అతనికి జరగాల్సిన నష్టం జరిగి పోయింది. సస్పెన్షన్ కారణంగా హాకీ ఇండియా లీగ్ వేలానికి దూరం అయ్యాడు. అంతేకాకుండా హాకీ ఇండియా లీగ్‌కు సంబంధించిన తొలి రిజర్వ్‌డ్ ఆటగాళ్ల జాబితాలో సైతం అతనికి చోటు లభించలేదు సరికదా జాతీయ జట్టుకు సైతం ఎంపిక కాలేక పోయాడు.