క్రీడాభూమి

హాకీ ఇండియా నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియా కప్ సాధించిన జూనియర్ హాకీ జట్టుకు ...
న్యూఢిల్లీ, నవంబర్ 23: ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులోని ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా నగదు నజరానా ప్రకటించింది. జట్టు సభ్యులతోపాటు కోచ్‌కి కూడా తలా లక్ష రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా సపోర్టింగ్ స్ట్ఫాలో తలా 50 వేల రూపాయలు ఇస్తామని పేర్కొంది. టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన హర్మన్‌ప్రీత్ సింగ్‌కు, అత్యుత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికైన వికాస్ దహియాకు ప్రత్యేకంగా చెరి లక్ష రూపాయలు ఇవ్వనుంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 6-2 తేడాతో చిత్తుచేసిన భారత జట్టు టైటిల్‌ను అందుకుంది. టోర్నమెంట్‌లో 15 గోల్స్ సాధించిన హర్మన్‌ప్రీత్‌కు బెస్ట్ ప్లేయర్ అవార్డు లభించింది. అదే విధంగా ప్రత్యర్థి జట్లు ఎక్కువ గోల్స్ చేయకుండా అడ్డుకున్న దహియాకు బెస్ట్ గోల్‌కీపర్ అవార్డు దక్కింది. ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరచడం, టైటిల్ సంపాదించడం ఎంతో గర్వకారణమని హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బత్రా ఒక ప్రకటనలో తెలిపాడు. భారత్ ప్రతిష్టను పెంచిన జట్టును ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నాడు. ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని టోర్నీలను గెల్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ సత్తా జట్టుకు ఉందని వ్యాఖ్యానించాడు.
ఇంకా కష్టపడాలి: కోచ్
ఆసియా కప్‌ను గెల్చకున్నంత మాత్రాన సరిపోదని, ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని భారత జూనియర్ హాకీ జట్టు కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. ఆసియా కప్‌లో విజయభేరి మోగించడం ఎంతో సంతోషాన్నిస్తున్నదని అతను పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్‌తో రాణించడం జట్టు విజయాన్ని ఖరారు చేసిందని అన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు టోర్నీలో గొప్పగా ఆడారని అంటూ, ఇదే సర్వస్వమని అనుకోకుండా, మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నాడు. భవిష్యత్ టోర్నీలపై దృష్టిని కేంద్రీకరిస్తున్ననని తెలిపాడు. జర్మనీ, బెల్జియం, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాలతో ఎక్కువ మ్యాచ్‌లు జరగాలని హెచ్‌ఐ అధికారులకు సూచించాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఫలానా ఆటగాడు బాగా ఆడాడని చెప్పడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ విజయం కోసం పోరాటాలు కొనసాగించారని అన్నాడు. ఇది సమష్టి విజయమని, రానున్న కాలంలోనే జట్టు మొత్తం ఇదే విధంగా సంయమనాన్ని ప్రదర్శిస్తూ ఆడుతుందని తెలిపాడు. (చిత్రం)ఆసియా కప్ జూనియర్ హాకీ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సాధించిన భారత ఆటగాళ్ల ఆనందం